యువతిని చంపేసి..గొనె సంచిలో చుట్టి...

A Man Murdered A Woman In Hyderabad

01:10 PM ON 31st May, 2016 By Mirchi Vilas

A Man Murdered A Woman In Hyderabad

అఘాయిత్యాలకు పాల్పదేవాళ్ళు ఏదో రూపంలో తమ ప్రతాపం చూపుతున్నారు. చివరకు షోషల్ మీడియాను అడ్డుపెట్టుకుని అకృత్యాలకు పాల్పడుతున్నారు. తాజాగా, ఫేస్బుక్ పరిచయం ఓ యువతి ప్రాణం తీసింది. కన్నవారికి కడుపుశోకం మిగిల్చింది. ఈ దారుణానికి తెగబడిన నిందితుడు.. తాను ఏ తప్పూ చేయలేదని తొలుత బుకాయించినా చివరకు నేరం ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. మలక్ పేటకు చెందిన జానకి(26) అనే యువతి ఓ సంస్థలో డేటా ఎంట్రీ ఆపరేటర్గా పనిచేస్తోంది. ఏడాది క్రితం ఆమెకు ఫేస్బుక్లో యశ్వంతకుమార్ (27) అనే వ్యక్తితో పరిచయమైంది. చాటింగ్లతో ఆ పరిచయం స్నేహంగా మారింది. దాన్ని అవకాశంగా తీసుకుని అతడు మరింత దగ్గరవ్వాలని ప్రయత్నించాడు.

దూరంగా వెళ్లిపోదామంటూ ఆమెకు ప్రపోజ్ చేశాడు. అయితే, దీన్ని ఆమె అంగీకరించలేదు. మరోసారి అలాంటి ఆలోచన చేస్తే ఊరుకోబోనని, పోలీసులకు ఫిర్యాదు చేస్తానని హెచ్చరించింది. అయితే.. ఎలాగైనా తన పంతం తీర్చుకోవాలనే కక్షతో యశ్వంత ఈ నెల 17వ తేదీ తన గదికి రమ్మంటూ ఆమెతో నమ్మకంగా మాట్లాడాడు. గదికి రాగానే ఆమెను హతమార్చాడు. గోనెసంచిలో చుట్టి.. స్కూటీ పై మూసీ నది ఒడ్డున పడేసాడు.అయితే ఆమె ఒంటిపై ఉన్న బంగారు ఆభరణాలు, మొబైల్ ఫోన్ తీసుకుని అక్కడ నుంచి పరారయ్యాడు. ఉద్యోగానికి వెళ్లిన జానకి రెండు రోజులు దాటినా ఇల్లు చేరకపోవటంతో.. ఆమె కుటుంబ సభ్యులు 20వ తేదీన చాదర్ఘాట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.

మిస్సింగ్ కేసు నమోదుచేసిన పోలీసులు ఆమె కోసం గాలిస్తుండగా.. ఆదివారం ఉదయం హయతనగర్ మండలం గోరెల్లి గ్రామ సమీపంలోని మూసి నది వద్ద యువతి మృతదేహం ఉన్నట్లు సమాచారం వచ్చింది. పరిశీలించిన పోలీసులు అది జానకి మృతదేహంగా గుర్తించారు. అక్కడ లభించిన క్లూ ఆధారంగా.. యశ్వంతకుమారే ఆమెను హత్య చేసినట్లు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం అతడు పోలీసుల అదుపులోనే ఉన్నాడని అంటున్నారు.

ఇవి కూడా చదవండి:ఐపీఎల్ లో క్రికెటర్ల జీతాలు చూస్తే షాకవ్వల్సిందే

ఇవి కూడా చదవండి:తల్లితో అక్రమ సంబంధం... భార్యను వ్యభిచారం చేయమని ఒత్తిడి

English summary

A 23 Year Old Age Woman Named Janaki was murdered by her Facebook friend in Malakpet and thrown her dead body in Musi River. Recently Police file missing case and the dead body was found in Musi River. Police Arrested Yeshwanth Kumar And Taken Him into Their Custody.