ప్రేమించి పెళ్లి చేసుకున్న యువకుడు దారుణ హత్య.. ప్రేమించిన భార్యే..(వీడియో)

A man murdered at Vanasthalipuram

01:33 PM ON 1st October, 2016 By Mirchi Vilas

A man murdered at Vanasthalipuram

ప్రేమించి పెండ్లి చేసుకున్న ఓ యువకుడిని భార్య సోదరులు, మరో ఇద్దరు యువకులు దారుణంగా హత్యచేశారు. కత్తులతో పొడిచి, పూల కుండీలతో తల పగులగొట్టారు. మర్మాంగాలను సైతం కోశారు. ఈ ఘోర ఘటన హైదరాబాద్ లోని వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధి సచివాలయనగర్ లో గురువారం కలకలం రేపింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

1/8 Pages

గుంటూరు జిల్లాకు చెందిన సింగిడి వెంకటేశ్వర్ రావు 30 ఏండ్ల కిందట నగరానికొచ్చాడు. వనస్థలిపురంలో ప్రైవేట్ ఉద్యోగం చేస్తూ భార్య, ఇద్దరు కుమారులతో కలిసి ఉండేవాడు. 2011లో వెంకటేశ్వర్ రావు క్యాన్సర్ వ్యాధితో మృతి చెందాడు. నల్లగొండ జిల్లా కనగల్ కు చెందిన ఏదుల్ల వెంకట్ రెడ్డి కూడా తన ఇద్దరు కుమారులు, కుమార్తె సుష్మితారెడ్డితో కలిసి వనస్థలిపురంలో ఉండేవాడు. పక్కపక్కనే ఉండడంతో వెంకటేశ్వర్ రావు కుమారుడు లలిత్ ఆదిత్య, వెంకట్ రెడ్డి కుమారుడు యశ్వంత్ రెడ్డి మిత్రులయ్యారు.

English summary

A man murdered at Vanasthalipuram