ప్రేమించి పెళ్లి చేసుకున్న ఇళయ రాజాను లేపేసిన బావమరిది

A Man Named Ilayaraja Killed in Tamilnadu

01:28 PM ON 2nd June, 2016 By Mirchi Vilas

A Man Named Ilayaraja Killed in Tamilnadu

ఇదో దారుణ ఘటన ... ప్రేమవివాహం చేసుకున్న యువకుడు అతడి బావమరిది చేతిలో దారుణహత్యకు గురయ్యాడు. ఆ యువకుడి మృతదేహాన్ని కుటుంబీకులు తీసుకోకుండా రాస్తారోకో జరిపారు. తమిళనాడులోని తిరుచ్చి జిల్లా బ్రూస్ నగర్ ప్రాంతంలో జరిగిన సంఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. బ్రూస్ నగర్ లో వేర్వేరు కులాలకు చెందిన చెందిన ఇళయ రాజా, ఆనంది (17) వారం రోజులకు ముందు తల్లిదండ్రుల కు చెప్పకుండా ఇంటి నుంచి పారిపోయి రహస్యంగా ప్రేమ వివాహం చేసుకున్నారు. ఈ విషయం తెలిసిన ఇరువురి కుటుంబ సభ్యులు వారిపై మండిపడ్డారు. ఇళయరాజా పెద్దలు మాత్రమే ఈ ప్రేమ వివాహాన్ని అంగీకరించగా, ఆనంది ఇంట్లో మాత్రం ఆగ్రహం వ్యక్తమయింది.

ఈ నేపథ్యంలో విదేశాల నుంచి తిరిగొచ్చిన ఆనంది సోదరుడు అరుణ్ చెల్లె ప్రేమవివాహం సహించలేకపోయాడు. ఇళయ రాజాను హత్య చేసేందుకు పథకం వేసుకున్నారు. ఆ మేరకు రెండు రోజులకు ముందు ఇళయరాజాను కలుసుకున్న అరుణ్ తన చెల్లెలికి ఊరంతా తెలిసేలా పెళ్లి చేయాలని ఆశపడు తున్నానని మాయమాటలు చెప్పాడు. అతడి మాటలను నమ్మి ఇళయరాజా భార్యను ఆమె పుట్టింటికి పంపాడు. మంగళవారం సాయంత్రం కల్లకుడికి వెళ్లిన అరుణ్ , ఇళయరాజా, అతడి సోదరుడు బాలాజీతో కలిసి మద్యం తాగారు. అదే అదనుగా అరుణ్ మరికొంతమంది యువకులు కలిసి ఇళయ రాజా. బాలాజీపై మారణాయుధాలతో దాడి జరిపారు. బాలాజీ అక్కడి నుంచి పారిపోయి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. అయితే అప్పటికే ఇళయరాజా తలపై తీవ్రగాయాలతో శవంగా పడి ఉండటాన్ని చూసి దిగ్ర్భాంతి చెందారు. అరుణ్ , అతడి అనుచరులు జరిపిన దాడిలో ఇళయరాజా మృతి చెందాడని పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఇళయ రాజా మృత దేహాన్ని లాల్గుడి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కాని ఇళయరాజా కుటుంబీకులెవరూ పోస్టుమార్టంకు సంబంధించిన ఫారాల్లో సంతకం చేయకపోవడంతో పోస్టు మార్టం ఆగిపోయింది. ఇళయరాజా కుటుంబీకులుంతా కలిసి రోడ్డుపై బైఠాయించి హంతలకును తక్షణమే అరెస్టు చేయాలంటూ రాస్తారోకో జరిపారు. పోలీసులు జోక్యం చేసుకుని వారిని శాంతింప జేశారు. సంచలనం కలిగించిన ఈ సంఘటనకు సంబంధించి అరుణ్ ,అతడి అనుచరులకోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు.

ఇవి కుడా చదవండి:సంపన్నులతో డేటింగ్ చేస్తూ, లక్షలు ఆర్జిస్తున్నాడు

ఇవి కుడా చదవండి:పెళ్ళి ప్రపోజల్ కాదన్న టీచర్ కి చిత్రహింసలు .. ఆపై సజీవ దహనం

English summary

A Man Maned Ilayaraja and a girl named anandi were loved each other and married recently then the girl's brother was murdered him with the help of his friends in Tamilnadu.