నోట్ల రద్దు దెబ్బతో రూ. 300 కోట్లు కట్టాడు..!

A man paid 300 crores black money to the bank

11:00 AM ON 17th November, 2016 By Mirchi Vilas

A man paid 300 crores black money to the bank

ప్రధాని మోడీ తీసుకున్న పెద్ద నోట్ల రద్దు నిర్ణయం వల్ల జనం ఇబ్బందులు పడుతున్నా, కొన్ని మంచి సంఘటనలూ జరుగుతున్నాయి. అందుకు ఉదాహరణ ముంబైలో జరిగిన ఓ ఘటనను చూద్దాం... ఇందుకు సంబంధించిన వివరాలను ఓ బ్యాంకు మేనేజరు వెల్లడించారు. మా బ్యాంకు శాఖలో ఓ బిల్డర్ చాలా ఏళ్లుగా ఖాతాను కలిగి ఉన్నాడు. అతడు మా బ్యాంకుకు నాన్ పర్ఫార్మింగ్ అసెట్ కింద కొన్ని కోట్లు డీఫాల్ట్ చేశాడు. ఆ డబ్బులు కట్టాల్సిందిగా మూడు నెలల నుంచి వెంట పడుతున్నాం. అయినా లాభం లేకపోయింది. ఇప్పుడు ప్రధాని మోడీ నిర్ణయంతో అతడు కట్టాల్సిన రూ.300 కోట్లను తీసుకొచ్చి బ్యాంకులో కట్టేశాడు.

అదంతా అతడి నల్లడబ్బే. ఆ డబ్బు చెల్లించడానికి ముందు మాత్రం తన దగ్గర నల్లడబ్బేం లేదంటూ సదరు బిల్డర్ బుకాయించాడు. ఇప్పుడు అడ్డంగా దొరికిపోయి ఆ డబ్బునంతా కట్టేశాడు. అది మోడీ తీసుకొచ్చిన ఎఫెక్ట్ అని ఆ బ్యాంకు మేనేజర్ చెప్పారు. ఇంకా ఇలాంటి ఘటనలు చాలావున్నాయని అంటున్నారు.

English summary

A man paid 300 crores black money to the bank