లాటరీ తగిలిందన్న ఆనందంతో బాస్ పై మూత్రం పోసాడు(వీడియో)

A man peeing on his boss

05:43 PM ON 2nd August, 2016 By Mirchi Vilas

A man peeing on his boss

కొంత మందికి ఆనందం వచ్చినా, ఆగ్రహం వచ్చినా తట్టుకోలేరు. ఆ సమయంలో వారేం చేస్తారో వారికి తెలీదు, అర్ధం కాదు. అలాంటి కోవకు చెందిన ఒక వ్యక్తి ఆనందం తట్టుకోలేక తన బాస్ పై మూత్రం పోసాడు. ఆ వివరాల్లోకి వెళితే.. లండన్ లోని ఓ కంపెనీలో ఉద్యోగం చేస్తున్న వ్యక్తికి లాటరీ విన్ అయ్యాడని సమాచారం వచ్చింది. ఆఫీస్ లో ఉన్న అతను కుర్చున్న కుర్చీలోనే గంతులు వేశాడు. అటూ ఇటూ పరుగులు పెట్టాడు. ఆనందం పట్టలేక సాటి ఉద్యోగుల చుట్టూ తిరిగాడు. తరువాత నేరుగా బాస్ క్యాబిన్ లోకి వెళ్లాడు. బాస్ తో మాట్లాడుతున్న ఆయన పీఏని భయపెట్టి.. కుర్చీలో కుర్చున్న బాస్ ను కిందకు నెట్టి చితకబాదాడు.

తరువాత టేబుల్ మీదకు ఎక్కి కిందపడిన బాస్ మీద మూత్రం పోశాడు. నానా హంగామా చేసిన తరువాత అతను ఆఫీస్ నుంచి బయటకు వెళ్లి పోయాడు. ఈ హంగామా అంతా కార్యాలయంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యింది. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. ఒకసారి మీరు ఒక లుక్ వేసేయండి.

English summary

A man peeing on his boss