అల్లాహ్ అంటూ 8 మందిని కత్తితో పొడిచేశాడు

A man prods 8 members with knife

04:34 PM ON 19th September, 2016 By Mirchi Vilas

A man prods 8 members with knife

ప్రపంచంలో ఉగ్రవాదం ఎక్కడ చూసినా వెర్రితలలు వేస్తోంది. ఇక అగ్రరాజ్యం అమెరికాలో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలీని దుస్థితి నెలకొంది. ఓవైపు బాంబు దాడులు, మరోవైపు పేలుడు ఘటనలతో ప్రజలు బెంబేలెత్తుతున్నారు. ఇది చాలదన్నట్లు, మాన్ హటన్ లో పేలుడు జరిగిన సమయంలో మిన్నెసొటాలో ఓ దుండగుడు అల్లాహ్ అని అరుస్తూ ఓ షాపింగ్ మాల్ లో కత్తితో దాడికి పాల్పడ్డాడు. దొరికిన వారిని దొరికినట్టు గాయపరిచాడు. అతడి దాడిలో ఎనిమిది మంది గాయపడ్డారు. అనంతరం పోలీసుల కాల్పుల్లో దుండుగుడు ప్రాణాలు కోల్పోయాడు. ఇంతకీ విషయం ఏమంటే, కత్తితో పొడిచే ముందు మీరు ముస్లింలా అని బాధితులను దుండగుడు ప్రశ్నించాడని పోలీసులు చెబుతున్నారు.

అయితే కత్తితో రెచ్చిపోతున్న దుండగుడిని విధుల్లో లేని ఓ పోలీసు అధికారి కాల్చిచంపాడు. ఈ ఘటనను ఉగ్రదాడిగా అనుమానించడం లేదని, అయినప్పటికీ ఆ కోణంలో దర్యాప్తు చేస్తున్నట్టు అధికారులు పేర్కొన్నారు. ఇక తాము తుపాకి చప్పుళ్లు కూడా విన్నామని, భయంతో పరుగులు తీశామని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.

ఇది కూడా చదవండి: పని ఉందంటూ స్టూడెంట్ ని ఇంటికి తీసుకెళ్లి కోరిక తీర్చుకున్న టీచర్.. ఆపై..

ఇది కూడా చదవండి: మీకు 25 ఏళ్ళు వచ్చేలోపు మీరు కచ్చితంగా తెలుసుకోవాల్సిన 25 నిజాలు!

ఇది కూడా చదవండి: బ్రెస్ట్ సర్జరీలతో హాట్ లుక్ సంపాదించుకున్న హీరోయిన్స్!

English summary

A man prods 8 members with knife