బాత్ రూమ్ లో సీసీ కెమెరాలు పెట్టాడు.. ఆపై ఏం చేసాడంటే..

A man puts cc cameras in bathroom

11:08 AM ON 7th October, 2016 By Mirchi Vilas

A man puts cc cameras in bathroom

చేతిలో స్మార్ట్ ఫోన్, అతి చిన్న కెమెరాలు వచ్చాక మంచి కన్నా చెడే ఎక్కువన్నట్లు వ్యవహారం వుంది. తాజాగా యువతుల బాత్ రూమ్ లో ఓ రియల్ ఎస్టేట్ ఏజెంట్ రహస్యంగా కెమెరాలు పెట్టి నగ్న దృశ్యాలను చిత్రీకరించాడట. ఆస్ట్రేలియా దేశంలోని సిడ్నీ నగరంలో చోటుచేసుకున్న ఈఘటనలోకి వెళ్తే.. తూర్పు సిడ్నీ నగరంలోని కింగ్స్ ఫోర్డ్ యూనిట్ అపార్టుమెంటులో యువతులు వినియోగించే బాత్ రూమ్ లో స్టీఫెన్ యావో అనే రియల్ ఎస్టేట్ ఏజెంటు రహస్య కెమెరాలు ఏర్పాటు చేశాడు. ఈ బాత్ రూమ్ ను 22, 23 ఏళ్ల వయసు గల యువతులు వినియోగిస్తున్నారు. ఓ యువతి స్నానం చేస్తుండగా యూఎస్బీ డ్రైవ్ లా ఉన్న రహస్య కెమెరా కనిపించింది.

దీంతో ఆందోళన చెందిన యువతి కెమెరాను తీసుకొని మారౌబా పోలీసుస్టేషనుకు వెళ్లి ఫిర్యాదు చేసింది. కెమెరాను పరిశీలించిన పోలీసులు... బాత్ రూమ్ లో యువతులు స్నానం చేస్తున్న దృశ్యాలు స్పష్టంగా రికార్డు అయి ఉన్నాయని గుర్తించారు. పోలీసులు స్వాధీనం చేసుకున్న రహస్య కెమెరాలతోపాటు సీసీటీవీ ఫుటేజ్ ను వేవేర్లీ కోర్టులో గురువారం ప్రవేశపెట్టారు. ముగ్గురు యువతుల నగ్న దృశ్యాలను రహస్య కెమెరాల ద్వారా చిత్రీకరించానని నిందితుడైన స్టీఫెన్ యావో కోర్టులో నేరాన్ని అంగీకరించాడు. దీంతో కోర్టు నవంబరు 23వ తేదీన తన తీర్పు వెలువరించనుంది.

English summary

A man puts cc cameras in bathroom