కదిలే విమానం ఎక్కేందుకు రన్ వే పై పరుగు.. మరి ఏమైందో తెలుసా

A man ran on runway to catch flight

12:12 PM ON 11th August, 2016 By Mirchi Vilas

A man ran on runway to catch flight

సాధారణంగా కదులుతున్న బస్సు, రైలులో ఎక్కేందుకు కొందరు అతి కష్టం మీద ప్రయత్నిస్తుంటారు. మరికొందరు కావాలనే ప్లాట్ ఫార్మ్ పై సరదాగా వేచి ఉండి, సడన్ గా కదిలిపోతున్న సమయంలో రైలు ఎక్కే ప్రయత్నం చేస్తుంటారు. ఇవి ఒక్కోసారి ప్రాణాల మీదికి తెచ్చిన ఘటనలు ఎన్నో వున్నాయి. అయితే ఓ ప్రయాణికుడు ఏకంగా కదులుతున్న విమానాన్ని అందుకునేందుకు తెగ ప్రయత్నించాడు. రన్ వే పరుగెత్తి దాన్ని వెంబడించాడు. ప్రయోజనం లేకపోగా సెక్యూరిటీ నిబంధనలు ఉల్లంఘించినందుకు అరెస్ట్ అయ్యాడు. స్పెయిన్ రాజధానిలోని మాడ్రిడ్ విమానాశ్రయంలో ఈ ఘటన జరిగింది. వివరాల్లోకి వెళ్తే...

ఓ వ్యక్తి గ్రాన్ కానరియాకు వెళ్ళేందుకు ఆలస్యంగా ఎయిర్ పోర్టుకు వచ్చాడు. అయితే అతడు ఎక్కాల్సిన విమానం అప్పటికే టేకాఫ్ కు సిద్ధమైంది. ఎలాగైనా అందుకోవాలన్న ఉద్ధేశంతో అతగాడు ఎత్తైన ల్యాడర్ పైనుంచి కిందకు దూకాడు. కదులుతున్న విమానం కోసం తన బ్యాగుతో రన్ వే వైపు పరుగెత్తాడు. ఫ్లైట్ అందుకోకపోవడంతో అక్కడి నుంచి జారుకున్నాడు. అయితే కానరియా చేరిన అతడ్ని సెక్యూరిటీ అధికారులు అరెస్ట్ చేశారు. ఉగ్రవాదం కోణంలో ప్రశ్నించిన అధికారులు ఎలాంటి అనుమానం వ్యక్తం కాకపోవడంతో వదిలేశారు. సెక్యూరిటీ నిబంధనలు ఉల్లంఘించిన దానిపై కేసులు నమోదు చేశారు. ఆగస్ట్ 5న జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. మాడ్రిడ్ ఎయిర్ పోర్టులో ఇది కామనేనంటూ కొందరు నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. మొత్తానికి అందరినీ హడలు గొట్టే ఇలాంటి ఘటనలు రిపీట్ కాకుండా చూడాలని పలువురు కోరుతున్నారు.

English summary

A man ran on runway to catch flight