బిజినెస్ కోసం పిలిచి... దారుణంగా రేప్ చేశాడు

A man raped a business women in Delhi

05:58 PM ON 2nd April, 2016 By Mirchi Vilas

A man raped a business women in Delhi

ఆ మధ్య విశ్వమంతా సంచలనం సృష్టించిన నిర్భయ కేసు మొదలు దేశ రాజధాని ఢిల్లీలో మహిళలకు రక్షణ లేదన్న విషయం పలుసార్లు బయటపడింది. తాజాగా బిజినెస్ లావాదీవులకు పిలిచి.. మహిళా పారిశ్రామికవేత్త పై ఓ కామాంధుడు అఘాయిత్యానికి పాల్పడ్డాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు నిందితుడి కోసం పోలీసులు గాలింపు మొదలు పెట్టారు. శుక్రవారం మధ్యాహ్నం చండీగఢ్‌కు చెందిన ఓ వ్యక్తి.. బిజినెస్ డీల్ గురించి మాట్లాడాలంటూ 33 ఏళ్ల ఢిల్లీ బేస్డ్ మహిళ వ్యాపారవేత్తను పిలిచాడు. ఇందుకోసం ఢిల్లీలోని కన్నాఘాట్ ప్రాంతంలో ఉన్న ఓ హోటల్‌కి వెళ్లారు. చర్చల నిమిత్తం మత్తు మందు కలిపిన కూల్ డ్రింక్‌ను ఆమెకు ఆఫర్ చేయడంతో ఆమె దాన్ని తాగి, స్పృహ తప్పింది.

ఇదే అదనుగా భావించిన ఆ వ్యక్తి, ఆమె పై అచ్యాచారం చేసాడు. ఆ తర్వాత బాధితురాలిని అక్కడే వదిలేసి పరారయ్యాడు. బాధితురాలు స్ఫ్రుహ లోకి వచ్చాక జరిగిన దారుణాన్ని గుర్తు చేసుకుని, లబో దిబోమంటూ పోలీస్‌స్టేషన్‌కి వెళ్ళి ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు, నిందితుడి కోసం వేట ప్రారంభించారు. బాధితురాలు దక్షిణ ఢిల్లీలోని డిఫెన్స్ కాలనీలో ఉంటుంది.

English summary

A man raped a business women in Delhi. A man called a women for business and later he raped that women.