చెల్లినే కాటేసాడు...ఆ పై చెప్పుకోలేని చోట కర్రతో...

A Man Raped A Girl Who Called Him As A Brother In Warangal

11:54 AM ON 7th June, 2016 By Mirchi Vilas

A Man Raped A Girl Who Called Him As A Brother In Warangal

కలికాల ప్రభావం వికృత రూపం కొనసాగిస్తోంది. వావివరసలు మరిచిపోయి ఆడవాళ్ళపై అత్యాచారాలు మితిమీరిపోతున్నాయి. తాజాగా ఓ చెల్లిపై అన్న అత్యాచారానికి ఒడిగట్టాడు. రక్షణ కల్పించాలిన వాడే , కంచె చేను మేసిన చందంగా మారాడు. ‘అన్నా’ అని ఆప్యాయంగా పిలిచే చెల్లి లాంటి అమ్మాయినే ఆ దుర్మార్గుడు చెరిచాడు. గదిలో పెట్టి తాళ్లతో బంధించి.. నోట్లో గుడ్డలు కుక్కి.. 24 గంటలపాటు ఆమెకు నరకం చూపాడు. ప్రతిఘటించిన పాపానికి ఆమె ఒళ్లంతా వాతలు తేలేలా, కందిపోయేలా అత్యాచారం చేశాడు. నిర్భయ ఘటనను తలపించే ఈ దారుణం వరంగల్ నగరం నడిబొడ్డున ఉన్న పెద్దమ్మ గడ్డలో జరిగింది.

నగరానికి చెందిన బాధిత యువతి.. ఇంటర్ పూర్తి చేసి ప్రభుత్వ ఐటీఐలో చదువుతోంది. తమ ఇంటి ఎదురుగా ఉండే జోగు శ్రీనివాస్ అలియాస్ వాసు అనే యువకుడితో ఆమెకు పరిచయమైంది. ఇంటి ఎదురుగా ఉంటూ.. మూడు సంవత్సరాలుగా ఆమె చదువుకు కొద్దికొద్దిగా డబ్బులిస్తూ నమ్మకంగా మంచివాడిలా నటించే ఆ కామాంధుడి మనసులో దుర్మార్గాన్ని పసిగట్టలేక పోయిన అన్నా అని పిలచేది. అయితే.. అదనుకోసం చూస్తున్న శ్రీనివాస్ ఈ నెల 4 వ తేదీ శనివారం కళాశాలకు బయలు దేరిన ఆ అమ్మాయిని మాయమాటలు చెప్పి బైక్ పై ఎక్కించుకుని.. పెద్దమ్మగడ్డలో ఓ కళాశాల పక్కన ఉన్న వేల్పుగొండ కుమారస్వామి అనే వ్యక్తి ఇంటికి తీసుకెళ్లి దారుణంగా అత్యాచారం చేశాడు.

ఆమె ఎంత వేడుకున్నా ఆ నరరూపరాక్షసుడి మనసు కరగలేదు సరికదా.. నోట్లో గుడ్డలు కుక్కి... చెప్పుకోరాని చోట కర్రతో కొట్టి హింసించాడు. శనివారం మధ్యాహ్నం నుంచి ఆదివారం మధ్యాహ్నం వరకు పదేపదే అత్యాచారం చేస్తూ ఆమెకు నరకం చూపాడు. భోజనం కోసం బయటకు వెళ్లినప్పుడు ఆమె ఎలాగోలా కట్లువిప్పుకొని అక్కడి నుంచి తప్పించుకుంది. ఇంటికి చేరుకుని విషయం తల్లికి చెప్పి కుప్పకూలిపోయింది. కూతురి శరీరంపై ఉన్న గాయాలు చూసిన ఆ తల్లి కన్నీరుమున్నీరయింది. సోమవారం విద్యార్థినితోపాటు కుటుంబ సభ్యులు, మహిళా సంఘాల నాయకులు హన్మకొండ ఏసీపీ శోభన్ కుమార్ ను కలిసి ఫిర్యాదు చేశారు. నిందితుడు శ్రీనివాస్ కోసం ప్రత్యేక టీమ్ లతో గాలిస్తున్నామని హన్మకొండ పోలీసులు తెలిపారు. అయితే..వారు ఇప్పటికే నిందితుడిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నట్టు తెలుస్తోంది. కాగా..తన సోదరిపై ఇంత అఘాయిత్యానికి పాల్పడిన దుర్మార్గుడిపై కేసు నమోదు చేసేందుకు పోలీసులు వెనుకాడుతున్నారని బాధితురాలి సోదరుడు అంతకుముందు ఆరోపించాడు. ఆమెకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ.. పోలీస్ స్టేషన్ లో బ్లేడుతో గొంతు, చెయ్యి కోసుకున్నారు.

ఇవి కూడా చూడండి: చంద్రబాబు సినిమా టికెట్ కొన్నారు..

ఇవి కూడా చూడండి:నవ నిర్మాణ దీక్షలో రోజా ప్రత్యక్షం

English summary

A Man Named Srinivas was raped a girl in front of her house who calls him as brother. On June 4th he taken that girl on bike and raped her and he beated up her very severely and later she escapes from him and she came to her home and complained in police station.