కూతురిని కాటేసిన కామాంధుడు

A Man Rapes His Daughter In Uttar Pradesh

05:23 PM ON 19th March, 2016 By Mirchi Vilas

A Man Rapes His Daughter In Uttar Pradesh

విలువలు దిగాజారిపోతున్నాయి అనడమే గానీ విలువలు పునరుద్ధరించే చర్యలు శూన్యం... అందుకే దారుణాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి.... రోజూ ఎక్కడో అక్కడ మనదేశంలో వినడానికే ఇబ్బంది పడే సంఘటనలు చోటుచేసుంటున్నాయి. సభ్య సమాజం తలదించుకునే విధంగా ఈ ఘటనలుంటున్నాయి. ఇంకా చెప్పాలంటే మనం బతుకుతు న్నది మనుషుల మధ్యనేనా అనే సందేహాన్ని కలిగిస్తున్నాయి. తాజగా జరిగిన ఓ సంఘటన చూస్తే, మరీ ఇంత ఘోరమా అనిపిస్తుంది. బంధాలు, అనుబంధాలను- వావి వరసలను మరిచిన ఓ కామాంధుడు చివరకు కన్న కూతురినే కాటే సిన అంత్యంత హేయమైన ఘటన ఇది. 15 సంవత్సరాల వయసున్న ఆ బాలికకు ఒకటా రెండా ఏకంగా నాలుగు సంవత్సరాలుగా ఆ నరకం చూపిస్తు న్నాడు ఆ మానవ మృగం ...ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీలో జరిగింది.... ఇక తట్టుకోకోలేకపోయిన ఆ బాలిక చివరకు స్నేహితురాలి సహాయంతో తగిన బుద్ధి చెప్పాలనుకుని, పక్కా ప్లాన్‌ సిద్ధం చేసుకుంది. అంతే వెంటనే ఆచరణలో పెట్టింది. ఆ ప్లాన్ ప్రకారం, ఆ మృగం ఆడుతున్న వికృత క్రీడను కిటికీలోంచి స్నేహితురాలు మొబైల్‌లో వీడియో తీసింది. అంతే ఆ వీడియోను సాక్ష్యంగా చూపించి ఆ కామాంధుడిని కటకటాల పాలు చేసింది. అయితే విషయం ఏమంటే, తండ్రి చేస్తున్న భయంకరమైన ఈ పాడుపని గురించి, ఆ బాలిక తల్లికి ఎన్నో సార్లు మొరపెట్టుకున్నా నమ్మలేదట. తీరా ఆ వీడియో చూసిన తర్వాత ఆమె తల్లి నివ్వెరపోయింది. కూతురితో కలిసి పోలీస్ స్టేషన్‌కు వెళ్లి మరీ ఆ కామాంధుడిని అరెస్ట్ చేయించింది. తండ్రి అనే పదానికే మచ్చ తెచ్చిన ఇలాంటి కామందులు వుంటే ఏమిటి ? పొతే ఏమిటి?

English summary

A Man in Uttar pradesh rapes his own daughter from 4 years. That girl said many times to her mother but her mother did not believed the thing and on fine she the girl shooted the whole thing in mobile phone and show as proof and filed a case on his father.