ఆ ఒక్కడూ 140 మందితో రొమాన్స్.. ఆ లిస్టులో మహిళా పోలీసు కూడా..

A man romance with 140 women

03:57 PM ON 25th July, 2016 By Mirchi Vilas

A man romance with 140 women

అవునా, అంటే అవుననే అంటున్నారు. ఎందుకంటే, ఉత్తరప్రదేశ్ లో ఓ వ్యక్తి మరీ రొమాంటిక్ గా మారాడు. ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 140 మంది మహిళలతో రొమాన్స్ కొనసాగించాడు. చివరికి అతడి అక్రమ సంబంధాల బాగోతం పోలీస్ స్టేషన్ కు చేరింది. అయితే అతగాడితో సంబంధమున్న మహిళల జాబితాలో ఓ పోలీసు అధికారిణి కూడా ఉండటం పలువురిని ఆశ్చర్యపరిచింది. ఈ కేసు విచారణలో భాగంగా సదరు వ్యక్తి కూతురు చెప్పిన మాటలు విని, పోలీసులు షాకయ్యారు. మహిళలతో సంబంధాల విషయంలో అతగాడు ఓ ప్రత్యేక పద్ధతిని పాటిస్తున్నాడు.

దానికోసం ఓ స్పెషల్ డైరీని ఏర్పాటుచేసుకొని.. ఎవరిని.. ఎప్పుడు.. ఎక్కడ.. ఎన్నిసార్లు కలిశాడనే విషయాలను అందులో పొందుపరుస్తున్నాడు. అంతేకాదు ఈ డైరీని చాలా భద్రంగా తన ఇంట్లోని ట్రంకుపెట్టెలో భద్రపరుస్తున్నట్లు అతడి కూతురు రోష్ని వెల్లడించినట్లు స్థానిక పత్రిక తెలిపింది. అయితే ఆ వ్యక్తికి సంబంధించి పూర్తి వివరాలు మాత్రం బహిర్గతం కాలేదు. అలాగే అతడిపై ఎవరు ఫిర్యాదు చేశారో కూడా వెల్లడించలేదు.

English summary

A man romance with 140 women