ఆర్మీ అధికారి భార్యకు పోర్న్ వీడియో పంపాడు.. ఆపై ఏమైందంటే..

A man sent a romantic video to army officer's wife

03:23 PM ON 6th October, 2016 By Mirchi Vilas

A man sent a romantic video to army officer's wife

సరైనోడి చేతికి దొరికితే అంతేసంగతులు అంటారు కదా ఇప్పుడు ఓ ప్రబుద్ధుడికి అదే జరిగింది. ఓ కాలనీ సంక్షేమసంఘం మాజీ అధ్యక్షుడు ఆర్మీ అధికారి భార్యకు అశ్లీల వీడియో పంపించిన ఘటన న్యూఢిల్లీ నగరంలో చోటుచేసుకుంది. దక్షిణ ఢిల్లీలోని వసంత్ కుంజ్ కాలనీ సంక్షేమ సంఘం మాజీ అధ్యక్షుడైన 40 ఏళ్ల ఏకే మెహతా తమ కాలనీలో నివాసముంటున్న ఆర్మీ అధికారి భార్యకు నాలుగున్నర నిమిషాల నిడివిగల అశ్లీల వీడియో పంపించాడు. మెహతా కాలనీ సంక్షేమసంఘం అధ్యక్షుడిగా ఉన్నపుడు కాలనీ సమస్యలపై ఆర్మీ అధికారి భార్య వెళ్లి అతనితో మాట్లాడేది.

ఆ పరిచయాన్ని ఆసరాగా తీసుకొని తనకు అశ్లీల వీడియో పంపించాడని ఆర్మీ అధికారి భార్య వసంత్ కుంజ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మహిళ ఇచ్చిన ఫిర్యాదుపై పోలీసులు ఐపీసీ సెక్షన్ 509, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్టు ప్రకారం మెహతాపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

English summary

A man sent a romantic video to army officer's wife