భార్యకు ఆపరేషన్ చేసిన డాక్టర్ పై కాల్పులు జరిపిన భర్త

A Man Shoots Male Doctor For Helping His Wife Deliver Their Baby

01:05 PM ON 27th May, 2016 By Mirchi Vilas

A Man Shoots Male Doctor For Helping His Wife Deliver Their Baby

సౌదీలో దారుణం చోటు చేసుకుంది. పురిటి నొప్పులతో ఆసుపత్రి వచ్చిన ఓ మహిళకు ఆపరేషన్ చేసి తల్లి బిడ్డలను కాపాడిన డాక్టర్ పై ఓ వ్యక్తి కాల్పులు జరిపాడు. దైవంతో సమానంగా చూసే వైద్య వృత్తిలో కూడా ఆ వ్యక్తి చెడునే వెతుక్కున్నాడంటే, కారణం ఏమిటి?

వివరాలలోకి వెళ్తే , ఓ మహిళ పురిటి నొప్పులతో సౌదీలోని రియాద్లో కింగ్ ఫహాద్ ఆసుపత్రికి వచ్చింది. ఆపరేషన్ చేయాల్సిందేనని ఆమె భర్తకు డాక్టర్లు తెలిపారు. అయితే మహిళా డాక్టర్లతోనే ఆపరేషన్ చేయించాలని ఆ వ్యక్తి కోరాడు. కాకపొతే, అందుబాటులో మహిళా డాక్టర్లు లేకపోవడం, అత్యవసరంగా ఆపరేషన్ చేయాల్సిన పరిస్థితి రావడంతో డాక్టర్ ముహన్నద్ అల్-జబ్న్ ఆ మహిళకు ఆపరేషన్ చేశాడు.

అయితే ఆపరేషన్ ఓ పురుష డాక్టర్ చేయడాన్ని ఆ వ్యక్తి జీర్ణించుకోలేకపోయాడు. తన భార్యను నగ్నంగా మరో పురుషుడు చూశాడని ఆగ్రహావేశాలకు గురయ్యాడు. ఆసుపత్రి యాజమాన్యం పై కూడా తన కోపాన్ని వెళ్లగక్కాడు. అంతేకాకుండా ఆపరేషన్ చేసిన ఆ డాక్టర్ పై కసిని పెంచుకున్నాడు. ఆపరేషన్ అనంతరం తల్లి, బిడ్డలను ఎలాంటి హాని జరగకుండా క్షేమంగా ఉండేలా ఆపరేషన్ చేసినందుకు కృతజ్ఞతలు తెలపడానికి డాక్టర్ని కలవాలని కోరాడు.ఆసుపత్రి ప్రాంగణంలో కలవడానికి వచ్చిన డాక్టర్ పై తనతో పాటు తీసుకువచ్చిన గన్ తో కాల్పులు జరిపి అక్కడి నుంచి పరారయ్యాడు. సౌదీ పోలీసులు అతన్ని పట్టుకొని అరెస్ట్ చేశారు. కాగా కాల్పుల్లో గాయపడిన డాక్టర్ ముహన్నద్ అల్-జబ్న్ కు ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. అతనికి ఎంలాంటి ప్రాణాపాయం లేదని డాక్టర్లు తెలిపారు.

ఇవి కూడా చదవండి:జీర్ణం, జీర్ణం వాతాపి జీర్ణం అని ఎందుకంటారో తెలుసా?

ఇవి కూడా చదవండి:భక్తురాలితో శృంగారం చేస్తూ దొరికేసిన దొంగ బాబా!

English summary

A Man in Saudi Arabia fires gun on doctor for helping his wife to give birth to baby. He said that he was asked the doctors to assist lady doctors but instead of lady doctors male doctor did the operation.