'మరణం ముంచుకొస్తుంది' అంటూ విమానంలో కేకలు!

A man shouts in Aeroplane

05:28 PM ON 12th September, 2016 By Mirchi Vilas

A man shouts in Aeroplane

కొన్ని ఘటనలు ఒక్కోసారి నవ్వు తెప్పించినా, కొన్ని భయం గొల్పుతాయి. సరీగ్గా ఆ విమానంలో అదే జరిగింది. గాల్లో విమానం ప్రయాణిస్తున్న సమయంలో ఒక్కసారిగా ఓ వ్యక్తి అల్లాహ్ అక్బర్.. మరణం సమీపిస్తోంది అని బిగ్గరగా కేకలు వేయడంతో ఒక్కసారిగా ప్రయాణికులు భయభ్రాంతులకు గురయ్యారు. ఇంగ్లాండ్ లోని గాట్విక్ నుంచి వెనిస్ బయలుదేరిన ఈజీజెట్ ఈజెడ్ వై 5263 విమానంలో ఈ ఘటన జరిగినట్లు బ్రిటీష్ హోం ఆఫీస్ అధికారులు వెల్లడించారు. అక్రమ వలసదారులను తరలిస్తున్న విమానంలో ఈ ఘటన జరిగినట్లు సమాచారం. అలా అరచిన వ్యక్తి చేతికి బేడీలు ఉన్నాయి.

చేతికి బేడీలు ఉన్న ఆ వ్యక్తి 29 సార్లు అల్లాహ్ అక్బర్, 17 సార్లు మరణం సమీపిస్తోంది, మనం అందరం చనిపోబోతున్నాం అని తొమ్మిది సార్లు అరిచినట్లు ప్రయాణికులు చెప్పుకొచ్చారు. అతడి కేకలతో భయపడిపోయిన ప్రయాణికులు, చిన్నారులు ఏడ్వడం మొదలెట్టడంతో వెంటనే స్పందించిన అధికారులు అతడ్ని అరవకుండా అదుపు చేశారు. అయినా విమానాల్లో ఇలాంటి వాళ్ళను తరలిస్తే ఎలాగని, ఒకవేళ తరలించే ముందు చర్యలు అయినా చేపట్టాలి కదా అని పలువురు అంటున్నారు.

ఇది కూడా చదవండి: బంగారు పతకం గెల్చిన మరియప్పన్ జీవితం గురించి తెలియని విచారకర విషయాలు!

ఇది కూడా చదవండి: బిజినెస్ మెన్ ని రాత్రి కల్సిన హీరోయిన్.. ఉదయానికి షాక్ ఇచ్చింది!

ఇది కూడా చదవండి: మార్కెట్ లో రాధికా ఆప్టే బ్లూ ఫిలిం సీడీలు!

English summary

A man shouts in Aeroplane