కృష్ణ పుష్కరాల్లో 'ఇంద్ర' సినిమా చూపించాడు!

A man shows Indra movie in Krishna Pushkaras

11:18 AM ON 18th August, 2016 By Mirchi Vilas

A man shows Indra movie in Krishna Pushkaras

ఇదేమిటి పుష్కరాలకు సినిమా చూపించడం ఏమిటని అనుకుంటున్నారా? పైగా మెగాస్టార్ మూవీ 'ఇంద్ర' చూపించడం ఏమిటనే సందేహాలు వస్తున్నాయా? 'మీది తెనాలే.. మాది తెనాలే' అంటూ ఇంద్ర సినిమాలో బ్రహ్మానందం బురిడీ కొట్టించిన ఘటన గుర్తుందా? గంగా నదిలో పిండప్రదానం చేయడానికి వచ్చిన ఏవిఎస్ కుటుంబాన్ని నిలువు దోపిడీ చేయడం తెలుసు కదా. పిండ ప్రదానం చేసే సమయంలో నగలు, డబ్బులు కొట్టేస్తారు. సరిగ్గా ఇప్పుడు ఇలాంటి సంఘటనే కృష్ణా పుష్కరాల్లో జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. ఖమ్మం జిల్లా కొత్తగూడేనికు చెందిన బండారి లింగేశ్వరరావు, తమ పితృదేవతలకు పిండప్రదానం చేసేందుకు కృష్ణాఘాట్ కు వచ్చారు. అక్కడ విశాఖజిల్లా పెదవాల్తేరుకు చెందిన పురోహితుడు బొంగు ఆదినారాయణను కలిశారు.

కార్యక్రమం జరుగుతున్న సమయంలో, లింగేశ్వరరావు చేతికి ఉన్న నవరత్న ఉంగరం, వెండి ఉంగరాన్ని ఆదినారాయణ కంట పడ్డాయి. వాటిని ఎలాగైనా కాజేయాలనే దుర్భుద్ధి కలిగింది. దీంతో పిండప్రధానం చేసేటప్పుడు చేతి వేళ్లకు బంగారు వస్తువులు ఉండకూడదని మాయమాటలు చెప్పాడు. అతడి మాటలు విన్న లింగేశ్వరరావు.. వాటిని తీసి తన బ్యాగ్ లో భద్రపరచుకున్నాడు. ఆ తర్వాత పిండాలను ఒంటరిగా వెళ్లి నదిలో కలపమని చెప్పా రు. వాటిని కలిపి.. అయనకు దక్షిణ చెల్లించి తన బ్యాగులో ఉన్న ఉంగరాలను చూసుకోగా వాటిలో నవరత్నాల ఉంగరం మిస్ అయింది. ఉంగరం కనిపించకపోయేసరికి ఆదినారాయణను అడిగాడు. తనకేమీ తెలియదని బుకాయించడంతో చివరకు లింగేశ్వరరావు అక్కడే ఉన్న డీఎస్పీ పి.సోమశేఖర్ ను ఆశ్రయించాడు. ఆదినారాయణను గట్టిగా నిలదీయడంతో ఉంగరాన్ని ఇచ్చేశాడు. పురోహితుడిని కృష్ణలంక పోలీసులకు అప్పగించారు.

English summary

A man shows Indra movie in Krishna Pushkaras