ఫ్యాన్సీ నంబర్ కోసం 33.3 కోట్లు కుమ్మరించాడు

A Man Spends 33 Crores For Car Number in UAE

01:14 PM ON 7th June, 2016 By Mirchi Vilas

A Man Spends 33 Crores For Car Number in UAE

ఫ్యాన్సీ నంబర్ .. అంటే ఇష్టపడని వారెవరుంటారు. అది కూడా ఓ పిచ్చే అని చెప్పవచ్చు. ముఖ్యంగా వాహనాల రిజిస్ట్రేషన్లో ఈ ఫ్యాన్సీ నంబర్ ప్లేట్ కోసం పోటీ పడుతుంటారు. కొందరైతే లక్షల రూపాయలు ఖర్చు పెట్టి తమకు కావాల్సిన నంబర్ తెచ్చేసుకుంటారు. అయితే యూఏఈకి చెందిన ఈ వ్యాపారవేత్త కూడా ఓ ఫ్యాన్సీ నంబర్ కోసం ఏకంగా కోట్ల రూపాయలు కుమ్మరించాడు.వివరాల్లోకి వెళ్తే,

ఆరిఫ్ అహ్మద్ అల్ జరోనీ యూఏఈలో వ్యాపారవేత్త. ఆరిఫ్ కు నంబర్ 1 చాలా ఇష్టమట. అందుకే తన కారు నంబర్ ప్లేట్ కోసం రూ. 33.3 కోట్లు ఖర్చు చేసి దాన్ని సొంతం చేసుకున్నాడు. స్థానిక హోటల్ లో జరిగిన వేలంలో ఏకంగా రూ. 33.3 కోట్లకు నెంబర్ వన్ దక్కించుకున్నాడు. ఎంత ఖర్చైనా సరే..ఆ నంబర్ కావాలనుకున్నానని ఆరిఫ్ చెబితే, తాము అనుకున్న దాని కన్నా ఈ నంబర్ చాలా ఎక్కువ ధర పలికిందని ఎమిరేట్స్ ఆక్షన్ ప్రతినిధులు తెగ సంబర పడిపోతున్నారు.

English summary

A Businessman in UAE spends a huge amount of 33.3 crores to own No.1 number plate. The auction officials were very happy to get this much of huge amount in auction.