ఎయిర్ పోర్ట్ లో కత్తితో పొడుచుకున్నాడు..

A Man stabbed himself with a knife in the airport

04:28 PM ON 17th December, 2015 By Mirchi Vilas

A Man stabbed himself with a knife in the airport

అది లండన్ లోని హీత్రూ విమానాశ్రయం. అందరూ ప్రయాణాల తొందరలో ఉన్నారు. ఇంతలో విమానాశ్రయంలో వేచి ఉన్న ఓ వ్యక్తి ఉన్నట్లుండి కత్తితో తనను తానే పొడుచుకున్నాడు. ఈ ఘటన లండన్ లోని హీత్రూ విమానాశ్రయంలో కలకలం రేపింది. ఓ వ్యక్తి ఉన్నట్టుండి కత్తితో తన తలలో, ఛాతిమీద పొడుచుకున్నాడు. రక్తమోడుతూ అటు ఇటు పరుగులు తీశాడు. అప్రమత్తమైన భద్రతా సిబ్బంది అతడిని అదుపులోకి తీసుకుని వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన విమానాశ్రయంలో ప్రయాణికులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. భయభ్రాంతులైన మహిళలు తమ పిల్లల్ని అక్కున చేర్చుకున్నారు. అయితే అతను ఎవరిపైనా దాడికి పాల్పడలేదని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఉగ్రవాది కాకపోవచ్చని పోలీసులు అభిప్రాయపడ్డారు. గత నెలలో లండన్‌లోని ఓ రైల్వే స్టేషన్‌లో ఉగ్రదాడి జరిగిన నేపథ్యంలో భారీ భద్రతా ఏర్పాట్లు చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు.

English summary

A man stabbed himself with a knife in his head in Heathrow airport, London