వీడెవడో రియల్ శంకర్ దాదాల ఉన్నాడు

A Man Studying Medicine From 20 Years

05:06 PM ON 24th February, 2016 By Mirchi Vilas

A Man Studying Medicine From 20 Years

క్రికెట్ చరిత్రలో కపిల్ దేవ్ రికార్డులు సృష్టిస్తే , ఈ కపిల్ దేవ్ గడిచిన 20ఏళ్లుగా ఓ ఆశ చావక బెదిరింపులు కొనసాగిస్తున్నాడు. చివరకు పోలీసుల విచారణ ఎదుర్కొంటున్నాడు. వివరాల్లోకి వెళితే, ఝార్ఖండ్‌కి చెందిన కపిల్ దేవ్ అనే వ్యక్తి డీఎంసీ మెడికల్‌ కళాశాలలో1995లో చేరాడు. అయినా రెండో సంవత్సరం పరీక్ష కూడా గట్టెక్కలేదు. మెడిసిన్‌ పూర్తి చేసి దేశ సేవ చేయాలన్నది ఇతని ఆశయమట. మరి బాగా చదివి పరీక్షలు పాసవ్వాలి కదా. అదిలేదు, అందుకే 20 ఏళ్ల నుంచి కుస్తీ పడుతున్నా, అతని వల్ల కావడం లేదు. ఇప్పుడు అతని వయసు 52. ఇప్పటికీ పరీక్షలు రాయడం కొనసాగిస్తూనే ఉన్నాడు. అయినా పని అవ్వకపోవడంతో పరీక్ష పాస్‌ చేయమని ప్రిన్సిపాల్‌ని బెదిరిస్తూనే ఉన్నాడు. పాస్ చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటానని కూడా బెదిరిస్తున్నాడు.

‘నేను దళితుడిని. డాక్టర్నై నా దేశానికి సేవ చేద్దామనుకుంటున్నాను. కాబట్టి ఎలాగైనా పాస్‌ మార్కులు వేయండి. దళితుడినైన నామీద దయచూపిస్తే దేవుడు మిమ్మల్ని చల్లగా చూస్తాడు. కాబట్టి ఎలాగైనా నేను పాస్‌ అయ్యేలా చూడండి’ అని పరీక్ష రాసిన ప్రతిసారీ ప్రిన్సిపల్‌కి మెసేజ్‌లు పంపేవాడు. పరీక్షలో మార్కులు రాకుండా పాస్‌ చేయడానికి ప్రిన్సిపల్‌ ఒప్పుకోకపోయేసరికి చంపేస్తానని కూడా బెదిరించాడు.

ఇక చివరికి ఈసారి పరీక్ష పాస్‌ చేయకపోతే తానే ఆత్మహత్య చేసుకుంటానంటూ బెదిరించడం మొదలుపెట్టాడు. దాంతో కళాశాల యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ప్రస్తుతం ఈ మెడికోను పోలీసులు విచారిస్తున్నారు. ఇదో మున్నాభాయ్ కధ లా వుంది కదా ...

English summary

A man Named Kapil Dev was Studying Medicine in DMC medical college in Jaharkhand For 20 Years.He says that he want to do service to people by becoming doctor but he was never passed medicine in these 20 years.Recently he warned principal to pass him or i will kill you.College principle complained to police and police arrested him and taken into their custody.q