ఏకంగా నాలుగు కోట్లు కారులో తీసుకెళుతుంటే...

A man taking 4 crores in car

11:32 AM ON 14th November, 2016 By Mirchi Vilas

A man taking 4 crores in car

మంగళవారం ప్రధాని నరేంద్ర మోదీ రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేసి వాటి స్థానంలో కొత్త రూ.500, రూ.2వేల నోట్లను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ నోట్ల మార్పిడి కోసం పెద్ద ఎత్తున బ్యాంకులు, ఏటీఎంల వద్ద వినియోగదారులు బారులు తీరుతున్నారు. మరో పది రోజుల వరకు బ్యాంకులు, ఏటీఎంల వద్ద రద్దీ ఇలాగే ఉంటుందని భావిస్తున్నారు. కాగా కారులో రద్దు అయిన వెయ్యిరూపాయల కరెన్సీనోట్లు రూ.4కోట్లను తీసుకువెళుతుండగా చెక్ పోస్టులో పోలీసులు పట్టుకొని ఆదాయపుపన్ను శాఖాధికారులకు అప్పగించిన సంఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలో చోటుచేసుకుంది.

బుర్హాన్ పూర్ పట్టణానికి చెందిన షబ్బీర్ హుసేన్ తన కుటుంబంతో కలిసి రెండు సూట్ కేస్ లు, ఓ బ్యాగులో రూ.4కోట్ల వెయ్యిరూపాయల కరెన్సీ నోట్లను కారులో తీసుకువెళుతుండగా షాహపూర్ పోలీసులు పట్టుకున్నారు. నాలుగుకోట్ల రూపాయల డబ్బుతో మహారాష్ట్రలోని బుల్దానా జిల్లా నుంచి అంటూర్లీ చెక్ పోస్టు మీదుగా మధ్యప్రదేశ్ లోని మల్కాపూర్ పట్టణానికి వస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని నేపానగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఉప ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ డబ్బును కారులో తరలిస్తున్నారని పోలీసులు చెప్పారు. నాలుగుకోట్ల రూపాయలను ఆదాయపుపన్నుశాఖకు అప్పగించి సెక్షన్ 102 కింద షబ్బీర్ హుసేన్ పై పోలీసులు కేసు నమోదు చేశారు.

English summary

A man taking 4 crores in car