బట్టలూడదీసి హింసించాడు - అరెస్టయ్యాడు

A Man Tortured His Employee In Kuwait

01:16 PM ON 30th May, 2016 By Mirchi Vilas

A Man Tortured His Employee In Kuwait

కేసు పాతదే ... కానీ సోషల్ మీడియా లో వైరల్ అవ్వడంతో ఇప్పుడు మెడకు చుట్టుకుంది. ఫలితంగా పోలీసులు ఎలర్ట్ అయ్యారు. వివరాల్లోకి వెళితే, తన వద్ద పనిచేస్తున్న ఓ వ్యక్తిని నగ్నంగా మార్చి చితకబాదిన ఓ బెదూన్ వ్యక్తిని కువైట్ పోలీసులు అరెస్ట్ చేశారు. దాదాపు ఏడాది క్రితం జరిగిన ఈ సంఘటనకు సంబంధించిన వీడియో తాజాగా సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుండడంతో స్పందించిన పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. అతని వద్ద పనిచేస్తున్న ఈజిప్షియన్ కార్మికుడి పై దాడిచేయడమే కాకుండా బాధితుడి దుస్తులు విప్పేసి తీవ్రంగా హింసించాడు. ఈ మొత్తం దృశ్యాన్ని రికార్డు చేసిన ఈజిప్షియన్ వ్యక్తిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బెదూన్ వ్యక్తితో ఆర్థిక సంబంధాలు దెబ్బతినడంతో అతడిని ఇరికించేందుకు ఇటీవల ఆ వీడియోను ఈజిప్టియన్ వ్యక్తి ఆన్లైన్లో పోస్టు చేసినట్టు అధికారులు పేర్కొన్నారు. భద్రతాధికారులు నిందితులు ఇద్దరినీ అదుపులోకి తీసుకుని దర్యాప్తు జరుపుతున్నట్టు అంతర్గత మంత్రిత్వ శాఖ పేర్కొంది.

ఇవి కూడా చదవండి:టాయ్‌లెట్‌కు వెళ్తే, పురుషాంగం పై కాటేసిన పైథాన్

ఇవి కూడా చదవండి:డేర్ ఉంటే నైట్ టైం ఈ హర్రర్ మూవీస్ ఒంటరిగా చూడండి

English summary

A Man In in Kuwait was severely tortured his employee by removing his clothes and one of his friend captured this thing in his mobile phone and now he kept this video in Social media and now those two were arrested by the Kuwait Police.