పెళ్ళాన్ని ఫేస్ బుక్ లో అమ్మకానికి పెట్టిన ప్రబుద్ధుడు

A Man Tried To Sell His Wife On Facebook In Madhya Pradesh

01:09 PM ON 8th March, 2016 By Mirchi Vilas

A Man Tried To Sell His Wife On Facebook In Madhya Pradesh

అబ్బో! అభినవ హరిశ్చంద్రుడు!!

అలనాడు ఆడిన మాట తప్పకుండా ఉండడం కోసం, కష్టాల పాలైన సత్య హరిశ్చంద్రుడు చివరకు కట్టుకున్న భార్యను అమ్మకానికి పెడితే, ప్రస్తుతం ఓ ప్రబుద్ధుడు డబ్బు కోసం కట్టుకున్న భార్యనే ఫేస్‌బుక్‌లో అమ్మకానికి పెట్టాడేసాడు. మధ్యప్రదేశ్‌లోని ఖార్గోనె జిల్లాలో చోటు చేసుకున్న ఈ ఘటన సంచలనం సృష్టించింది. వివరాల్లోకి వెళ్తే,

మధ్యప్రదేశ్‌లోని ఖార్గోనె జిల్లా శభమ్‌ నగర్‌లో నివాసం ఉంటున్న దిలీప్‌ తన భార్యను ఫేస్‌బుక్‌లో అమ్మకానికి పెట్టాడు. నాలుగేళ్ల కిత్రం వివాహం జరిగిన దిలీప్‌కు 3ఏళ్ల కుమార్తె ఉంది. భార్య, అతని కుమార్తె ఫొటోను లక్ష రూపాయల ప్రైస్‌ టాగ్‌తో ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేశాడు. ఈ ప్రకటనను చూసిన కొంతమంది దిలీప్‌ను సంప్రదించారట. చివరకు ఈ విషయం కాస్తా పోలీసుల దాకా చేరడంతో దిలీప్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఫేస్‌బుక్‌లో పెట్టిన ప్రకటనను తీసేయించేసి, అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

English summary

A Man Named Dilip Kumar from Khargone district in Madhya Pradesh puts his wife for sale in Facebook for One Lakh. Police arrested him and taken him to custody and deleted this post from Facebook.