శ్రీవారి హుండీనే దోచేసాడు ... ఆతర్వాత ఏమైంది ...(వీడీయో)

A Man Tried To Theft in Tirupati Temple And Caught To Security

11:28 AM ON 15th December, 2016 By Mirchi Vilas

A Man Tried To Theft in Tirupati Temple And Caught To Security

శ్రీ తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి అంటే అందరికీ ఎంతోభక్తి ఉంటుంది. కలియుగ ప్రత్యక్ష దైవంగా భాసిల్లే తిరుమల శ్రీవారిని దర్శించి కానుకలు సమర్పించి , మొక్కులు తీర్చుకుంటారు. దొంగ, దొర అనే తేడా లేకుండా ఎందరో హుండీలో కానుకలు సమర్పించుకుంటారు. అందుకే శ్రీవారి హుండీ ఎప్పుడూ గల గల లాడుతూ ఉంటుంది. అయితే శ్రీవారి హుండీనే ఓ వ్యక్తి చోరీకి యత్నించి పట్టుబడ్డాడు. వివరాల్లోకి వెళ్తే, శివకాశీకి చెందిన నవనీతకృష్ణన్ బుధవారం భక్తులతో పాటు ఆలయంలోకి ప్రవేశించి దర్శనానంతరం బయటకు వచ్చారు. ఆలయం వెలుపల ఏర్పాటు చేసిన అదనపు హుండీలో నుంచి నగదు రూ. 15వేలు చోరీ చేసి పారిపోయేందుకు యత్నించాడు. ఈ దృశ్యాలు సీసీ కెమెరాకు చిక్కాయి. దీంతో అప్రమత్తమైన భద్రతా సిబ్బంది వెంటనే అక్కడకు చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఇదే వ్యక్తి గతంలో కూడా శ్రీవారి ఆలయంలో దొంగతనానికి పాల్పడ్డాడని సీఐ నాగరాజు అంటున్నారు.

ఇవి కూడా చదవండి: రాత్రివేళ ఇవి తిన్నారో ఇక అంతే సంగతులు

ఇవి కూడా చదవండి:బంధువైన మహిళా ఉద్యోగినిపై లైంగిక దాడి - మంత్రి రాజీనామా

English summary

A Man named Navaneeta Krishnan from Sivakasi was tried to theft from a Hundi in Tirupati Temple and he was red handedly caught to security team in the Temple.