ఇద్దరు పెళ్ళాలను మెయింటేన్ చెయ్యడానికి దొంగగా మారాడు

A man turned as a thief to maintain his two wives

05:10 PM ON 11th July, 2016 By Mirchi Vilas

A man turned as a thief to maintain his two wives

అతడు నారీ నారీ నడుమ మురారి తరహాలో ఇద్దరు భార్యలను మెయింటేన్ చేస్తున్నాడు. అయితే ఆ ఇద్దరు భార్యలను పోషించేందుకు దొంగగా అవతారమెత్తాడు. దీంతో అప్పటి వరకు కూలీనాలి చేసుకుంటూ బ్రతికిన అతడు, ఇద్దరు భార్యలతో వేరువేరు కాపురాలు పెట్టాడు. ఇక ఆ రెండు కుటుంబాలను పోషించడంలో ఇబ్బందులు వచ్చి పడ్డాయి. ఎలా అధిగమించాలో తెలియక, చివరకు స్కూటర్ల దొంగగా మారాడు. ఈక్రమంలో ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 25 స్కూటర్లు కొట్టేశాడు. మొత్తానికి పోలీసులకు చిక్కాడు. దొంగిలించిన స్కూటర్ల విలువ దాదాపు రూ.15 లక్షలు ఉంటుందని పోలీసులు చెప్పారు.

వాటన్నింటిని వారు రికవర్ చేసుకున్నారు. బెంగళూరుకు చెందిన మురళీ రామారావు అనే ఈ వ్యక్తికి ఇద్దరు పెళ్లాలున్నారు. ఒకరికి తెలియకుండా మరొకరితో సంసారం చేయడం మొదలుపెట్టాడు. అయితే, క్రమంగా వారి పోషణ భారం కష్టమైపోయింది. అంతే, అప్పటి వరకు కూలిగా ఉ‍న్న అతడు ఒక్కసారిగా దొంగ అవతారమెత్తాడు. ఒక భార్య దగ్గరకు వెళ్లే సమయంలో బస్సులో వెళుతూ వచ్చే సమయంలో ఓ స్కూటర్ కొట్టేసి దానిపై మరో భార్య వద్దకు వెళ్లేవాడు. అడిగిన ప్రతిసారి తన స్నేహితుల స్కూటర్లు అని చెప్పేవాడు. అయితే, బెంగళూరు మంత్రి మాల్ వద్ద హోండా డియో ద్విచక్ర వాహనాన్ని దొంగిలిస్తూ పోలీసులకు పట్టుబడటంతో అసలు విషయం వెలుగుచూసింది.

English summary

A man turned as a thief to maintain his two wives