పెళ్ళానికి కారు కొనడానికి కొడుకుని అమ్మకానికి పెట్టాడు

A man wants to sell his son for money to purchase car for his Wife

12:27 PM ON 18th January, 2017 By Mirchi Vilas

A man wants to sell his son for money to purchase car for his Wife

ఇదో విచిత్రమైన కేసు. ఎందుకంటే, ఓ వ్యక్తి భార్యను విడాకులు కోరాడు. మరి విడాకులు ఇవ్వాలంటే కొత్త కారు కొనివ్వాలని ఆమె షరతు పెట్టింది. కారు కొనడానికి తగినంత డబ్బు లేకపోవడంతో తన ఐదు నెలల చిన్నారిని ఆ తండ్రి ఆన్ లైన్ లో పరిచయమైన ఓ వ్యక్తికి అమ్మకానికి పెట్టాడు.

పూర్తి వివరాల్లోకి వెళ్తే,వివరాల్లోకి వెళితే.. చైనాలోని లిన్వి పట్టణానికి చెందిన జాంగ్ .. కొన్ని కారణాల వల్ల భార్య నుంచి విడాకులు తీసుకోవాలనుకున్నాడు. అందుకు అంగీకరించిన అతని భార్య ఓ షరతు విధించింది. కొత్త కారు కొనిస్తే తాను విడాకులకు సిద్ధమేనంటూ తేల్చి చెప్పింది. ఎలాగైనా భార్య నుంచి విడాకులు తీసుకోవాలనుకున్న జాంగ్ .. కారు కొనేంత డబ్బు లేకపోవడంతో తన ఐదు నెలల కుమారుడిని అమ్మకానికి పెట్టాడు. ఆన్ లైన్ లో పరిచయమైన ఓ వ్యక్తితో 80వేల యువాన్లకు బేరం కుదుర్చుకున్నాడు. చిన్నారిని అతనికి అప్పగించి డబ్బు తీసుకునేందుకు జాంగ్ ఓ కూడలి వద్ద వెయిట్. చేస్తున్నాడు.

ఓ పది నిమిషాలు గడిచింది. చిన్నారి ఒంటిపై సరైన దుస్తులు లేకపోవడంతో చలి తీవ్రత కారణంగా ఆ పసివాడు ఏడుపు అందుకున్నాడు. సరిగ్గా అదే సమయంలో పెట్రోలింగ్ నిర్వహిస్తున్న పోలీసులు జాంగ్ ను అనుమానించి స్టేషన్ కు తరలించి విచారణ చేపట్టారు. దీంతో అసలు విషయం బయటికి వచ్చింది. భార్యకు కారు కొనిచ్చేందుకు డబ్బులేక కుమారుడిని అమ్మకానికి పెట్టినట్లు చెప్పాడు. తాము విడాకులు తీసుకుంటే తమ కుమారుడు అనాథ కాకుండా తల్లిదండ్రులు ఉంటారన్న ఆలోచనతో కూడా ఇలా చేసినట్లు జాంగ్ తెలిపాడు. జాంగ్ ను అరెస్టు చేసిన పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. కూడలిలో ఉన్న సీసీటీవీ ద్వారా రికార్డయిన దృశ్యాలను చూసిన నెటిజన్లు జాంగ్ పై తీవ్రంగా విరుచుకుపడ్డారు.

ఇది కూడా చూడండి : ఫాంటు జేబులో సెల్ ఫోన్ పెట్టుకుంటే ఇక అంతేసంగతులా ?

ఇది కూడా చూడండి : ఫేస్ బుక్ కు సుప్రీం నోటీసులు

ఇది కూడా చూడండి : పేరు మార్చేసుకున్న యాహూ

English summary

Mr.Jang belongs to china he wants to sell his son for money to buy a car to his wife. Mr. Jang wants to separate from his wife so asked her for divorce for that she requested a car from his side so that she will give divorce.