నడిరోడ్డుపై నీలిచిత్రాలు చూస్తూ అడ్డంగా బుక్కయ్యాడు!

A man watching blue films on road in Pune

03:13 PM ON 27th August, 2016 By Mirchi Vilas

A man watching blue films on road in Pune

ఇది కలికాల ప్రభావమో మరేమిటో గానీ ప్రపంచవ్యాప్తంగా నీలిచిత్రాలు చూసే వారి సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. బ్లూ ఫిలిం ఎక్కువగా వీక్షించే దేశాల వరుసలో ఇండియా కూడా పోటీపడి దూసుకెళుతుండటం పెద్ద విచిత్రం. ఒకప్పుడు పాశ్చాత్య దేశాలకే పరిమితమైన ఈ జాడ్యం పెరిగిన టెక్నాలజీ పుణ్యమా అని మన దేశానికి కూడా వ్యాపించింది. దానికి తోడు అరచేతిలోనే సమస్త ప్రపంచం అన్న చందంగా మొబైల్ డేటా అందుబాటులోకి రావడంతో మెట్రో నగరాల నుంచి గ్రామీణ ప్రాంతాల్లోని చాలామంది వీటిని వీక్షిస్తున్నారు. ముఖ్యంగా యువత బ్లూ ఫిలింల మాయలో పడి పెడతోవ పడుతోంది. గతంలో ఈ నీలిచిత్రాలను చాలామంది చాటుమాటుగా వీక్షించేవారు.

ఇతరులు చూస్తే ఎక్కడ తమను తప్పుగా అనుకుంటారో, నీచంగా మాట్లాడతారోనన్న భయం ఉండేది. అయితే ఇప్పుడు పబ్లిక్ అయిపోయింది. ఎంతలా అంటే, పుణెలో వర్షం పడుతుండగా నడిరోడ్డుపై పోర్న్ వీక్షిస్తూ ఓ వ్యక్తి అడ్డంగా బుక్కయ్యాడు. గొడుగు వేసుకుని గోప్యంగా చూస్తున్నాననుకున్నాడు కానీ అసలు విషయం అతను పసిగట్టలేదు. అతను బ్లూ ఫిలింలు వీక్షిస్తున్న సమయంలో గెయింట్ స్క్రీన్ కెమెరాకు ఈ దృశ్యం చిక్కింది. అంతే ఎదురుగా ఉన్న స్క్రీన్ లో అతను చేస్తున్న పనేంటో అందరికీ కనిపించింది. ట్రాఫిక్ సిగ్నల్ జంక్షన్ కావడంతో అందరూ అతనినే వింతగా చూశారు.

అతను మాత్రం ఎవరినీ పట్టించుకునే స్థితిలో లేడు. నాలుగు గోడల మధ్య చూస్తే తప్పేంటని ప్రశ్నించిన మేధావులు నడిరోడ్డుపై కనిపిస్తున్న ఈ నగ్న దృశ్యాలపై ఏమని స్పందిస్తారో మరి అంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.

ఇది కూడా చదవండి: ఆ సినిమా అల్లు శిరీష్ చేసుంటే ఎక్కడికో వెళ్లిపోదును.. కానీ..

ఇది కూడా చదవండి: భర్త ఆఫీస్ కి వెళ్ళగానే ఆమె ఏం చేసిందో తెలుసా(వీడియో)

ఇది కూడా చదవండి: ఫ్యాషన్ మ్యాగజైన్ ఎడిటర్ గా మెగా మేనల్లుడు

English summary

A man watching blue films on road in Pune