బ్యాంకు మూసేశాక తెరిపించిన మంత్రి.. ఎందుకో తెలిస్తే మతిపోద్ది!

A minister reopened the bank after closing

11:40 AM ON 18th November, 2016 By Mirchi Vilas

A minister reopened the bank after closing

ఓపక్క పెద్ద నోట్ల రద్దుతో సామాన్య ప్రజలు క్యూలో గంటలకొద్దీ నిలబడి నోట్లు మార్చుకుంటుంటే, వాళ్ళ కష్టాలు తీర్చాల్సిన ప్రజాప్రతినిధి ఒకరు వ్యవహరించిన తీరు మతిపోగొట్టింది. ఇది జరిగింది ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో... ఇంకా చెప్పాలంటే ఆయనో కేబినెట్ మంత్రి. ఇంకేముంది. నోట్లరద్దు దెబ్బతో బ్యాంకుల ముందు జనం క్యూలు కట్టడంతో చికాకుపడ్డ మంత్రి బ్యాంక్ బంద్ అయ్యాక తన ఒక్కడి కోసం మళ్ళీ తెరిపించుకున్నారు. తన కుమారులు, మద్దతుదారులతో కలిసి వచ్చిన మంత్రి ఇక్బాల్ మహ్మూద్ అప్పటికే పనివేళలు అయిపోయి మూసేసిన హెచ్డిఎఫ్సి బ్యాంక్ ను తెరిపించుకున్నారు.

సాయంత్రం ఆరున్నర తర్వాత వచ్చిన మంత్రి నేరుగా బ్యాంక్ మేనేజర్ రూంలోకి వెళ్లిపోయారు. తన నోట్లతో పాటు తన కుమారుల, మద్దతుదారుల నోట్లను మార్చుకున్నారు. జనం ఉండగా వస్తే తోపులాటలు ఉన్నాయని, అందుకే ఎవ్వరూ లేని సమయంలో వచ్చి నోట్లు మార్చుకున్నామని చెప్పారు. నోట్ల రద్దుపై మోదీ తన నిర్ణయాన్ని పున: పరిశీలించుకోవాలని మంత్రి ఇక్బాల్ సూచించారు.

English summary

A minister reopened the bank after closing