లేడీ పోలీస్ కు ఐ లవ్ యూ చెప్పిన ఘనుడు.. తరువాత ఏమైందంటే..

A minor boy proposed to lady police

03:25 PM ON 21st June, 2016 By Mirchi Vilas

A minor boy proposed to lady police

ఎంత గొప్ప సాహస వ్యక్తయినా పోలీసులని చూసే సరికి భయపడతాడు. అలాంటిది ఓ మైనర్ బాలుడు తన వయసుకు మించిన పని చేశాడు. ఏకంగా పోలీస్ కంట్రోల్ రూమ్ కు ఫోన్ చేసి అక్కడున్న మహిళా పోలీసుకు ఐ లైక్ యూ, ఐ లవ్ యూ అంటూ... ప్రపోజ్ చేసాడు. ఇంతకీ ఆ బాలుడు ఎందుకలా చేసాడో తెలియాలంటే అసలు విషయంలోకి వెళ్లాల్సిందే.. మహారాష్ట్రాలోని నాగ్ పూర్ కంట్రోల్ రూమ్ లో ఉన్న మహిళా సిబ్బందికి ఈ వింత పరిస్థితి ఎదురైంది. వరుసగా పోలీస్ కంట్రోల్ రూమ్ కు ఫోన్ చేయడం... ఫోన్ ఎత్తిన మహిళా పోలీసుకు ప్రపోజ్ చేయడం అదే పనిగా పెట్టుకున్నాడు.

ఏకంగా.. 140 సార్లు ఇలా చేసి చెప్పాడు. విసిగిపోయిన మహిళా పోలీసులు ఉన్నతాధికారుల దృష్టికి విషయాన్ని తీసుకెళ్లారు. క్రైమ్ బ్రాంచ్ ఆ అబ్బాయిని, అతని తండ్రిని అదుపులోకి తీసుకుని విచారణకు తీసుకొచ్చింది. బాలుడిని మందలించి, తండ్రి దగ్గర మరోసారి అలా జరగదంటూ వ్రాత పూర్వకమైన హామీని పోలీసులు తీసుకున్నారు. అనంతరం బాలుడి పై ఎలాంటి కేసు నమోదు చేయకుండా వదిలిపెట్టేశారు.

English summary

A minor boy proposed to lady police