మైనర్ కుమారుడికి బెంజి కారు గిఫ్ట్.. ఎంఎల్ఏపై రచ్చరచ్చ..

A MLA bought a benz car for his minor son

12:58 PM ON 26th November, 2016 By Mirchi Vilas

A MLA bought a benz car for his minor son

సోషల్ మీడియాలో పోస్ట్ కి కాదేది అనర్హం అన్నట్టుగా ఏది పడితే అది పోస్ట్ చేయడం వలన వాళ్ళ బుద్ధులు కూడా బయట పడుతున్నాయి. ఫలితంగా వివాదాలకు దారితీస్తోంది. పైగా గొప్పలకు పోయి పిల్లలకు ఇచ్చే గిఫ్ట్ లు చూస్తే, గుండె గుభేల్ మంటుంది. తాజాగా ఇలాంటి యవ్వారమే చోటుచేసుకుంది. పెద్ద నోట్ల రద్దు కారణంగా ఓ పక్క సరిపడా డబ్బులేక ప్రజలు ఇబ్బందిపడుతుంటే, మరో పక్క ఓ ఎమ్మెల్యే తన మైనర్ కుమారుడికి ఏకంగా బెంజ్ కారు కానుకగా ఇచ్చాడు. నిండా 18 ఏళ్లు కూడా లేని కుర్రాడికి ఏకంగా బెంజ్ కారు కొనివ్వడంతో సోషల్ మీడియాలో రచ్చరచ్చ అవుతోంది.

1/3 Pages

మహారాష్ట్రకి చెందిన రామ్ కదమ్ అనే బిజెపి ఎమ్మెల్యే తన కుమారుడి పుట్టినరోజు కానుకగా మెర్సిడెస్ బెంజ్ కొనిచ్చాడు. మైనర్ కు కారు కొనివ్వడమే కాకుండా ఆ ఫొటోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. పిల్లల పుట్టినరోజున ఖరీదైన కార్లు బహుమతి ఇవ్వడం ధనవంతులకు మామూలు విషయమే కావచ్చు కానీ ఓ మైనర్ కి అంత ఖరీదైన కారు కొనివ్వడంతో నెటిజన్లు మండిపడ్డారు.

English summary

A MLA bought a benz car for his minor son