ఆడపిల్లను కందని కోడలిని అత్త ఏం చేసిందో తెలిస్తే షాకౌతారు!

A mother in law gave a car gift for her daughter in law

10:38 AM ON 7th November, 2016 By Mirchi Vilas

A mother in law gave a car gift for her daughter in law

ఆడపిల్లైనా, మగపిల్లయినా ఒకటేనని పైకి ఎంత చెబుతున్నా ఆడపిల్ల పుడితే, కొందరి ఇళ్లలో జరుగుతున్న భాగోతం తెలియంది కాదు. ఆడపిల్లలు పుడితే అడ్డుగా భావిస్తూ అందుకు కోడలిని కారణంగా చేసి, నరకం చూపించే అత్తలున్న రోజులివి. ఎందుకంటే, ఆడపిల్లకు జన్మనిచ్చిందని కోడలిని వేధించే అత్తలను చూస్తున్నాం. పుట్టబోయేది ఆడపిల్లని తెలిసి పురిట్లోనే చంపేయమనే అత్తల గురించీ వింటున్నాం. ఫలితంగా ఆడపిల్లల సంఖ్యా తగ్గిపోయింది. అయితే ఆడపిల్ల పుడితే అదృష్టంగా భావించి కోడలిని కూతురిలా చూసుకునే అత్తలుండటం నిజంగా హర్షించదగ్గ విషయం.

కానీ తన కోడలు ఆడపిల్లకు జన్మనిచ్చిందని సంబరపడి, పట్టరాని ఆనందంతో కోడలిని ముద్దాడింది ఓ అత్త. అంతేకాదు ఓ కారును గిఫ్ట్ గా ఇచ్చింది. నిజంగా ఇలాంటి అత్త ఉందంటే నమ్ముతారా? కానీ, నమ్మి తీరాలి. ఎందుకంటే ఇది వాస్తవం కనుక. వివరాల్లోకి వెళ్తే...

1/3 Pages

ఉత్తరప్రదేశ్ లోని హమిర్ పుర్ జిల్లాలో కుష్భూ అనే ఓ వివాహిత పండంటి ఆడపిల్లకు జన్మనిచ్చింది. ఆమెకు ఆడపిల్ల పుట్టిందని తెలుసుకున్న కుటుంబ సభ్యులంతా ఎంతో సంతోషించారు. ఇక, ఆమె అత్త అయితే ఏకంగా బంధుమిత్రులను ఇంటికి పిలిచి పార్టీ కూడా చేసింది. ఆ అత్త పేరు ప్రేమాదేవి, పేరుకు తగ్గట్టు, ప్రేమను కురిపించింది.

English summary

A mother in law gave a car gift for her daughter in law