అక్రమ సంబంధం పెట్టుకుని కన్నకొడుకునే..

A mother killed her son for secret affair

11:21 AM ON 1st July, 2016 By Mirchi Vilas

A mother killed her son for secret affair

రోజురోజుకి అక్రమ సంబంధాలు పెరిగిపోతున్నాయి. ఇంట్లో వాళ్ళ మీద బలవంతం మీద ఇష్టం లేకపోయినా పెళ్లి చేసుకుంటున్న అమ్మాయిలు, లేదంటే భర్త సరిగ్గా పట్టించుకోక, లేదంటే భర్తని వదిలేసిన భార్యలు అక్రమ సంబంధాలు పెట్టుకుంటున్నారు. తాజాగా ఓ యువతి వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడన్న కారణంతో తన కన్నబిడ్డనే అంతం చేసింది. ఈ ఘటన కర్ణాటకాలోని పీణ్యా పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఆ వివరాల్లోకి వెళ్తే.. పీణ్యా పరిధిలోని శివపురలో రేఖమండల్ అనే మహిళ తన ఎనిమిదేళ్ల బబ్లిమండల్ అనే కుమారుడితో నివాసముంటోంది.

ఈమె గత కొన్నాళ్ళ నుంచి విద్యుత్ మండల్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. అయితే.. ఈ సంబంధానికి తన కుమారుడు అడ్డుగా ఉన్నాడని భావించిన రేఖామండల్.. అతనిని కడతేర్చాలని భావించింది. దీనికి తన ప్రియుడు సహకారం కూడా తీసుకుంది. ముందుగా వేసుకున్న ప్లాన్ ప్రకారం.. రేఖా తన ప్రియుడు విద్యుత్ తో కలిసి ఆ బాలుడిని దారుణంగా చంపేసింది. అతని మృతదేహం కనిపించకుండా ఓ మారుమూల ప్రదేశంలో పడేసింది. ఆ తరువాత తనకేమీ తెలియదన్నట్లుగా నటించింది. మరుసటి రోజు తన కుమారుడు కనబడటం లేదంటూ రేఖా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది.

కేసు నమోదు చేసుకుని పోలీసులు విచారణ చేపట్టగా.. అసలు విషయం బయట పడింది. తమ అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడనే కారణంతోనే రేఖా, ఆమె ప్రియుడు విద్యుత్ కలిసి బబ్లిమండల్ ని హత్య చేసినట్లు స్పష్టమైంది. దీంతో.. పోలీసులు వారిద్దరిని అరెస్ట్ చేశారు.

English summary

A mother killed her son for secret affair