కన్న బిడ్డలను హతమార్చిన తల్లి

A Mother Kills Her Daughters In Secunderabad

11:43 AM ON 17th March, 2016 By Mirchi Vilas

A Mother Kills Her Daughters In Secunderabad

కాల మహిమో ఏమో గానీ దారుణాలకు అంతూ పొంతూ లేకుండా పోతోంది. అకృత్యాలు , అత్యాచారాలు , పసి పిల్లల హత్య ఇలా రోజుకో ఘటన ఎక్కడో అక్కడ జరుగుతూనే ఉన్నాయి. తాజాగా జరిగిన దారుణం పరిశీలిస్తే, కడుపులో పెట్టుకుని కాపాడుకోవాల్సిన కన్నబిడ్డలను కన్నతల్లే హత్యచేసింది. ఓ బిడ్డను బాత్ రూంలో, మరో బిడ్డను బెడ్ రూంలో హతమార్చింది. ఈ దారుణం ఎక్కడో మారుమూల ప్రాంతంలో కాదు, సికింద్రాబాద్ తుకారం గేట్ పీఎస్ పరిధిలో చోటు చేసుకుంది. తవిష్క(7), తాన్వి(3) ఇద్దరిని కసాయి తల్లి అత్యంత దారుణంగా చిన్నారులను చంపేసింది. బిడ్డలిద్దరిని గొంతుకోసి హత్యచేసి పరారైంది. ఎప్పుడూ ఆడుతూ, పాడుతూ తిరిగే పిల్లలు రక్తపు మడుగుల్లో ఉండటం చూసి బంధువులు షాక్ గురయ్యారు , కన్నీరుమున్నీరయ్యారు. బుధవారం రాత్రి ఈ ఘటన వెలుగు చూసింది. అయితే రజినిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన సంబంధించి పోలీసు అధికారులు వివరాలు వెల్లడించారు. సెక్సువల్ హరాస్‌మెంట్‌లో ఇద్దరు పిల్లలు సఫర్ అవుతున్నారన్నారని అందుకే హత్య చేసి ఆపై తాను హత్య చేసుకుందామనుకున్నానని ఆమె చెప్పినట్లు పోలీసులు తెలిపారు. అయితే రజిని విషయంలో నిజానిజాలు త్వరలో తెలుసుకుంటామని పోలీసులు అంటున్నారు.

భార్య కాపురానికి రాలేదని చెవి కోసేసాడు

చెల్లెలి నగ్న వీడియో ఉందని చెప్పి అక్కను వాడుకున్నాడు

హైదరాబాద్ బాంబు మహారాష్ట్రలో పేలింది

English summary

A Mother in Secunderabad killed her Two daugherts named Tanvishka and Tanvi respectively.Mother said that the children were suffering from sexual harassment, so that's why she decided to kill her chiledren and latest she wanted to do suicide.She was arrested by the police and filed case on her.