గణేశుని గుడిలో ప్రసవించిన ముస్లీమ్ మహిళ.. తరువాత ఏమైందో తెలుసా?

A muslim lady gives birth to her baby in Lord Ganesha temple

11:46 AM ON 6th July, 2016 By Mirchi Vilas

A muslim lady gives birth to her baby in Lord Ganesha temple

ముస్లిం అయినా గణేశుని పేరు.. హిందూ ముస్లీమ్ గొడవలు, మతాల మధ్య చిచ్చు చూస్తూనే వున్నాం. కానీ అప్పుడప్పుడు హిందూ ముస్లిం సఖ్యత గురించి అనేక విషయాలు జరుగుతూ ఉంటాయి. ఇదిగో అదే కోవలోకి ఈ అంశం చేరింది. అతని జననం మతాలకతీతం. సభ్యసమాజానికి ఓ ఆదర్శపాఠం. హిందూ ముస్లీమ్ భాయి భాయి అనడానికి చూడచక్కని ఉదాహరణ ఇది. వివరాల్లోకి వెళ్తే.. ముంబాయ్ కి చెందిన నూర్జహాన్ పురిటి నొప్పులతో బాధపడుతున్న సమయంలో ఆమెను భర్త ఓ కారులో హాస్పిటల్ కు తీసుకెళ్తున్నాడు. అయినా నొప్పులు అధికమవడంతో ఎక్కడ తన కారులోనే ప్రసవిస్తుందోనని ఆ కారు డ్రైవర్ సడన్ గా ఆమెను తన కార్ లో నుండి దించమన్నాడు.

ఎంతగా బతిమిలాడినా ఆ కార్ డ్రైవర్ ఒప్పుకోలేదు. చేసేదేమీ లేక అక్కడే దిగి వేరే వాహనం కోసం భర్త ప్రయత్నిస్తున్నాడు. అయినా పురిటినొప్పులు ఇంకా ఎక్కువ అయ్యాయి తప్ప తగ్గలేదు. నొప్పులు తట్టుకోలేక నూర్జహాన్ కేకలు పెడుతుండడాన్ని గమనించిన అక్కడి మహిళలు పరుగున వచ్చారు. ఆమెను దగ్గర్లో ఉన్న వినాయకుని గుడిలోకి తీసుకెళ్లి, చుట్టూ చీరలు కట్టి ఆమెకు పురుడు పోశారు. ఆమె పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. బిడ్డను చూసి మురిసిపోయిన ఆ మహిళ 'గణేశ్' గుడిలో నా బిడ్డ పుట్టాడు. ఇంత కన్నా అదృష్టమేముంది. కనుక ఆ గణేశుడి పేరే నా బిడ్డకు పెడతాను అని చెప్పింది. అదండీ సంగతి.

English summary

A muslim lady gives birth to her baby in Lord Ganesha temple