ప్లూటోను దాటితే.. ప్లానెట్ నైన్ ఉందట

A new Planet After Pluto

04:58 PM ON 21st January, 2016 By Mirchi Vilas

A new Planet After Pluto

ప్లూటో.. తొమ్మిదో గ్రహం అని మనం చదువుకున్నాం. కానీ తొమ్మిదో గ్రహం కాదట. దాన్ని దాటితే మరో గ్రహం ఉందట. బహుశా అదే తొమ్మిదో గ్రహమై ఉటుందని తాజాగా ఖగోళ శాస్త్రవేత్తలు అనుమానిస్తున్నారు. సౌర కుటుంబంలో తొమ్మిదో గ్రహం ఉందని కాలిఫోర్నియా టెక్నాలజీ యూనివర్సిటీకి చెందిన సైంటిస్టులు తెలిపారు. దానికి ప్లానెట్ నైన్ అని పేరు పెట్టారు. ఆ గ్రహం సూర్యుడి చుట్టూ 15 వేల ఏళ్లకు ఒకసారి తిరుగుతుందట. సౌర వ్యవస్థ వయసు 4.5 బిలియన్ ఏళ్లు. సూర్యుడి నుంచి దూరంగా వెళ్లిన ఆ గ్రహం పూర్తిగా వాయు రూపంగా మారిందని శాస్త్రవేత్తలు అంటున్నారు. నెప్టూన్, యురానెస్ గ్రహాల తరహాలోనే కొత్త గ్రహం వాయు రూపంలో ఉందంటున్నారు. ఆ గ్రహం ఇప్పటికీ సూర్యుడి కక్ష్యలో తిరుగుతోందట. కాల్‌టెక్ వర్సిటీకి చెందిన మైక్ బ్రౌన్, కాన్‌స్టాన్టిన్ బాట్జిన్ సైంటిస్టులు ఈ కొత్త గ్రహం విశేషాలను వెల్లడించారు. నెప్ట్యూన్ గ్రహం తర్వాత ఉన్న ప్లానెట్ నైన్ వల్ల సౌర వ్యవస్థ గ్రహాల సంఖ్య పెరిగిందని శాస్త్రవేత్తలు అంటున్నారు.

English summary

Scientists were saying that a new planet has been there after Pluto and scientists named that planet as Planet 9.Scientists say that the planet will revolves for every 15 thousand years around the sun