దేవుడా మగాళ్ల నుంచి నువ్వే కాపాడాలి ... షాకింగ్ వీడియో

A New Video On Men By Saudi Women That Going Viral

11:37 AM ON 10th January, 2017 By Mirchi Vilas

A New Video On Men By Saudi Women That Going Viral

కొన్ని దేశాల్లో మహిళలకు అసలు హక్కులే ఉండవ్. ఏం చేసినా తప్పుగానే భావిస్తారు. ఈ నేపథ్యంలో పురుషాధిక్యంపై తమ ఆందోళన తెలుపుతూ ముగ్గురు మహిళలు విడుదల చేసిన వీడియో సౌదీ అరేబియాలో ప్రకంపనలు పుట్టిస్తోంది. అక్కడి నుంచి అమెరికా వరకు పాకి సెగలు రేపుతోంది. ఈ వీడియోలో సౌదీ మహిళలు దేవుడా మగాళ్ల నుంచి నువ్వే కాపాడాలి’’ అని వేడుకున్నారు. అమెరికా కొత్త అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పైనా విరుచుకుపడ్డారు. సౌదీ అరేబియాలో మహిళల హక్కులను హరిస్తూ అనేక అవకాశాల్లో పాల్గొనకుండా చేస్తున్నారని తూర్పూరబట్టారు. ఏదేమైనప్పటికీ వీడియో ఆసాంతం తమ సంప్రదాయ దుస్తుల్లోనే కనిపించారు.

మరోవైపు తమ ఆకాంక్షలను తెలిపేందుకు ముగ్గురూ మోకాళ్ల కిందుగా రంగు రంగుల దుస్తులు, షూ ధరించారు. బాస్కెట్ బాల్ ఆడుతూ, స్కేట్ బోర్డుపై రయ్..మని దూసుకెళ్లారు. బంపర్ కార్లు డ్రైవ్ చేస్తూ... డ్రైవింగ్ పట్ల తమకు గల మక్కువను తెలిపారు. అక్కడ మహిళలు డ్రైవింగ్‌ చూసేందుకు అనుమతి లేనందున చిన్నపిల్లాడితో కారు స్టార్ట్ చేయించడంతో వీడియో ప్రారంభమవుతుంది.

కారు నుంచి ఒక్కసారి బయటికి వచ్చిన తర్వాత మొదలవుతుంది తిట్ల దండకం... మగాళ్లు నాశనమైపోవుదురు గాక. మా మానసిక రోగాలకు వారే కారణం’’ అని సాగుతుంది. కాగా అచ్చం గతంలో ఇలాంటి జానపద గేయమే ఒకటి ఉండేదనీ.. దాన్ని ఆధారం చేసుకునే ఈ పాటను రూపొందించి ఉంటారని వాషింగ్టన్ పోస్టు ఉటంకించింది. అయితే కొత్తగా వచ్చిన పాటలో వివిధ రాజకీయ విమర్శలు కూడా ఉన్నాయి. పురుషుల కొంప’’ (హౌస్ ఆఫ్ మెన్) అంటూ ట్రంప్ కటౌట్ సైతం ప్రదర్శించారు. హిల్లరీ క్లింటన్ ఫోటోని కొట్టేసినట్టు చూపెడుతూ, పక్కన మీసాలు చూపించి పురుషుల ఆధిపత్యానికి వ్యతిరేకంగా నిరసన తెలిపారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోన్న ఈ వీడియో పై మీరూ ఓ లుక్కేయ్యండి...

ఇవి కూడా చదవండి: బన్నీని రౌండప్ చేసిన పవన్ ఫ్యాన్స్ (వీడియో)

ఇవి కూడా చదవండి: నాగబాబు వ్యాఖ్యలపై చిరంజీవి షాకింగ్ కామెంట్స్

English summary

A New video made by some of the women in Saudi Arabia on the rules on women in Saudi Arabia. This video was now trending and this video was based on the rules and regulations on women in Saudi Arabia.