క్రుజ్‌ రసికుడే ....  ఐదుగురు మహిళలతో ..

A Newspaper Says That Ted cruz has illegal affairs With Five Women

11:01 AM ON 28th March, 2016 By Mirchi Vilas

A Newspaper Says That Ted cruz has illegal affairs With Five Women

అవునా, అంటే అవుననే విధంగా ఓ కధనం వచ్చేసింది. పైగా అమెరికా అధ్యక్ష ఎన్నికల పోరులో ఇలాంటి వార్తా కధనం రావడంతో ఎక్కడ చూసినా ఇదే చర్చ.. చ చ .... అమెరికన్‌ అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో రిపబ్లికన్‌ అభ్యర్థుల మధ్య పోరు స్థాయి దిగజారిపోతోంది అంటూ పలువురు వాపోతున్నారు. హుందాతనం లేకుండా ఇలాంటి చౌకబారు , చీప్ ట్రిక్స్ తో ఎన్నికల్లో ప్రచారం సాగిస్తే ఎలా అంటూ అమెరికన్లే మండిపోతున్నారు. ప్రస్తుతానికి ఆ పార్టీ నుంచి బరిలో నిలిచిన బలమైన అభ్యర్థులు ట్రంప్‌, క్రుజ్‌ కొద్దిరోజులుగా భార్యలను రచ్చకీడ్చుకుంటున్నారు. ట్రంప్ భార్య పెళ్లి కాకముందు మోడల్ గా వివిధ మేగ్ జైన్స్ కిచ్చిన ఫోజులను చూపిస్తూ, వార్తలు రావడంతో, క్రుజ్ భార్య గురించి కూడా అందంగా లేదంటూ ట్రంప్ ప్రచారం చేసినట్లు వార్తలు వచ్చాయి. ఇక తాజాగా.. టెడ్‌ క్రుజ్‌పై నేషనల్‌ ఎంక్వైరర్‌లో ఓ కథనం ప్రచురితమైంది. క్రుజ్ కి ఏకంగా ఐదుగురు మహిళలతో అక్రమ సంబంధాలున్నాయని, మాంచి రసికుడని ఆ కధనం సారాంశం. పైగా ఆ ఐదుగురు ఎవరంటే, ఒక లాయర్‌ ..., ఒక స్కూల్‌ టీచర్‌...., పొలిటికల్‌ కన్సల్టెంట్‌... ఒక మామూలు అమ్మాయి... ఓ వేశ్య... వీరిందరితో క్రుజ్ కి వివాహేతర సంబంధం వుండట.

ఇవి కూడా చదవండి : బికీనీ వేసిందని టీచర్ ఉద్యోగం పీకేసారు.. ఆ పై వ్యభిచారిగా..

ట్రంప్ పనే ... కాదు ... ట్వీట్ ల యుద్ధం ...

ఈ కధనం అమెరికాలో సంచలనం సృష్టిస్తోంది. డోనాల్డ్‌ ట్రంపే ‘నేషనల్‌ ఎంక్వైరర్‌’లో ఉన్న తనవారితో ఈ కథనాన్ని ప్రచురింపజేశారని టెడ్‌ క్రుజ్‌ మండి పడుతుంటే, దాని వెనక తన హస్తం లేదని, తనకు అసలేమీ తెలియదని డోనాల్డ్‌ ట్రంప్‌ వివరంగా ఫేస్‌బుక్‌లో వివరణ కూడా ఇచ్చాడు. అయితే అసలు ట్విస్ట్ ఏమంటే, ఈ కథనానికి కావాల్సిన మసాలా రిపబ్లికన్‌ పార్టీ నుంచే అధ్యక్ష పదవికి పోటీపడుతున్న మరో అభ్యర్థి మార్క్‌ రూబియో వర్గమే అందించిందని డైలీబీస్ట్‌ అనే మరో పత్రిక ప్రచురించింది. మరోవైపు.. ట్రంప్‌, క్రుజ్‌ వర్గాలు మాత్రం పరస్పర దాడులు సాగించుకుంటున్నాయి. ట్రంప్‌కు మానసిక సమస్యలున్నాయని.. వాటిని దాచిపెడుతున్నాడని క్రుజ్‌ ప్రచార మేనేజర్‌ జెఫ్‌ రో ఒక ట్వీట్‌లో ఎద్దేవా చేయగా, క్రుజ్‌కు మానసిక ఆరోగ్య సంక్షోభం ఉందని డోనాల్డ్‌ ట్రంప్‌ కూడా ట్వీట్‌ చేసాడు.

ఇవి కూడా చదవండి : మ్యాచ్ జరుగుతుండగానే బిడ్డను కన్న ప్లేయర్

60%మహిళలు ట్రంప్ కి ఝలక్ ....

మరోవైపు.. మహిళలపై పదేపదే అవమానకర వ్యాఖ్యలు చేస్తున్న ట్రంప్‌ పట్ల అమెరికా మహిళలు రోజురోజుకూ విముఖులవుతున్నారని ఒక ఒపీనియన్‌ పోల్‌లో తేలింది. అందమైన మూర్ఖురాలు.. కుక్క.. కొవ్వెక్కిన పంది.. అంటూ వివిధ సందర్భాల్లో మహిళలను ఉద్దేశించి ట్రంప్ చేసిన వ్యాఖ్యల కారణంగా సొంతపార్టీకి చెందిన మహిళల్లోనే 39 శాతం మంది ట్రంప్ పట్ల వ్యతిరేక వైఖరితో ఉన్నారట. ఇక.. జీవోపీ నుంచి ట్రంపేఅధ్యక్ష అభ్యర్థి అయితే, ఆయనకు ఓటు వేయబోమని ఒక సర్వేలో 60 శాతం మంది మహిళలు తేల్చి చెప్పెసారట. ఇంతగా దిగజారిపోయి ప్రచారం సాగిస్తుంటే, రేపొద్దున పొరపాటున నెగ్గితే , ఇంకేమైనా ఉందా ?

ఇవి కూడా చదవండి : పాపం.. 19 నెలల కూతురినే పెళ్ళాడిన తండ్రి ...

English summary

American Presidential Candidate Ted Cruz has five illegal affairs with five women.This was published by one of the leading news paper in America.But Ted Cruz opposed the news and said that this was the plan of Donald trump.Donald trumph also denied Ted Cruz words.