పాత 5వేల నోటు వేలంలో ఎంత పలికిందో తెలిస్తే దిమ్మతిరిగుద్ది!

A old 5 thousand ruppe note got 30 lakhs in auction

10:50 AM ON 16th November, 2016 By Mirchi Vilas

A old 5 thousand ruppe note got 30 lakhs in auction

ఇండియాలో నోట్ల రద్దు కొత్తేమి కాదు. అయితే, ప్రధాని మోడీ తీసుకున్న పాత నోట్ల రద్దు నిర్ణయంతో ప్రజలు కొత్త నోట్ల కోసం బ్యాంకుల ముందు బారులు తీరారు. పాత నోట్లు ఎన్నుంటే అన్ని తీసుకెళ్లి మార్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ ఓ విషయం తెలిస్తే కనీసం ఒక్క నోటైనా దాచుకోవడానికి ప్రయత్నిస్తారేమో. అసలు విషయమేంటంటే, 1978లో మొరార్జీ దేశాయ్ ప్రభుత్వం 5వేలు, 10వేల నోట్లను ప్రవేశపెట్టింది. ఇంత పెద్ద విలువ కలిగిన నోట్లను ఇండియాలో ప్రవేశపెట్టడం అదే తొలిసారి. ఆ తర్వాత కొన్ని సంవత్సరాలకు వీటిని రద్దు చేశారు. అయితే అప్పటి నోటు ఒకటి ఇప్పడు ఈ నోట్ల వ్యవహారంతో వెలుగులోకి వచ్చింది.

1/4 Pages

1978లో చలామణిలో ఉన్న ఓ 5వేల నోటును వేలం వేసేందుకు మరుధర్ ఆర్ట్స్ ఆక్షన్ హౌజ్ ముందుకొచ్చింది. 2000 సంవత్సరం తర్వాత నోట్ల వేలం చట్టబద్ధం కావడంతో అప్పట్లో పాత వెయ్యి రూపాయల నోట్లను ఈ ఆక్షన్ హౌజ్ లో వేలానికి పెట్టారు. ఆ వెయ్యి రూపాయల నోటు ధర అప్పట్లో 2.4లక్షలు పలికింది.

English summary

A old 5 thousand ruppe note got 30 lakhs in auction