అంత్యక్రియలు చేస్తుండగా... పైకి లేచిన బామ్మ

A old woman reborn after death

05:48 PM ON 19th May, 2016 By Mirchi Vilas

A old woman reborn after death

అవును మీరు విన్నది నిజమే.. అంత్యక్రియలు చేస్తుండగా ఆమె లేచింది. ఆమె దెయ్యం కాదు, ఏ క్షుద్ర పూజలో చేసి ఆమెను లేపి కూర్చోబెట్టలేదు. అసలు విషయంలోకి వెళ్తే.. బంగారం వ్యాపారి మహేంద్ర కుమార్ లోదా భార్య అయిన పద్మాబాయ్ మే 16న అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో ఆసుపత్రికి తరలించారు. మంగళవారం ఆమె ఆరోగ్య పరిస్థితి విషమించడంతో వెంటిలేటర్ సహాయంతో చికిత్స అందించారు. ఆమె బతకడం కష్టమని డాక్టర్లు తేల్చి చెప్పేయడంతో ఆమెను ఇంటికి తీసుకెళ్లిపోయారు. 59 ఏళ్ళ పద్మాబాయ్ చనిపోయిందని భావించిన కుటుంబ సభ్యులు ఢిల్లీ, రాజస్థాన్‌లోని తమ బంధువులకు సమాచారం అందించారు.

ఆయా రాష్ట్రల్లోని పత్రికల్లో అశ్రునివాళి ప్రకటనలిచ్చారు. ఈ విషయం తెలిసిన బంధువులు ఆమె చివరి చూపు కోసం దూర ప్రాంతాల నుంచి తరలివచ్చారు. బుధవారం అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తుండగా ఆమె శ్వాస తీసుకోవడం గమనించారు. దీంతో వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించారు. అయితే ఆమె బతకడం కష్టమని తొలుత డాక్టర్లు చెప్పడంతో, చనిపోయిందని బ్రమపడడంతో కుటుంబ సభ్యులు అంత్యక్రియలకు చెయ్యడానికి సిద్ధమైపోయారు. చివరకు ఆమె బతికే ఉందని తెలియడంతో మిఠాయిలు పంచుకుని సంబరం చేసుకున్నారు.

English summary

A old woman reborn after death