8ఏళ్ళ కవలలపై యజమాని లైంగిక దాడి.. ఆపై..

A owner romantic harassment on 8 years minor girls

12:56 PM ON 8th November, 2016 By Mirchi Vilas

A owner romantic harassment on 8 years minor girls

రోజురోజుకీ మహిళలపై అందునా చిన్నారులపై కూడా లైంగిక దాడులు పెచ్చుమీరుతున్నాయి. ఎన్ని చర్యలు తీసుకున్నా ఇవి ఆగడం లేదు. తాజాగా హైదరాబాద్ కాటేదాన్ ప్రాంతంలో జరిగిన ఘటన షాకింగ్ కి గురిచేస్తోంది. కామంతో కళ్ళు మూసుకుపోయిన ఓ ఫ్యాక్టరీ యజమాని ఎనిమిదేళ్ళ కవల బాలికలపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఓ స్వచ్ఛంద సంస్థ చొరవతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. ఈ ప్రబుద్ధుడ్ని సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. ఇతనితోబాటు మరో ఏడుగురు కూడా అభం శుభం తెలియని ఆ చిన్నారులపై లైంగిక దాడులకు దిగుతూ వచ్చారని తెలిసింది. ఆ మైనర్ల తల్లి ప్రోత్సాహంతో గత అయిదేళ్లుగా ఈ దారుణం జరుగుతూ వచ్చింది. ఈ కేసుకు సంబంధించి అగర్వాల్ సహా మరో ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు.

1/3 Pages

మైనర్ల తల్లితో ప్రదీప్ అగర్వాల్ కు అక్రమ సంబంధం ఉందని శంషాబాద్ పోలీసులు తెలిపారు. ఇటీవలే తన ఫ్యాక్టరీలో పని చేసే ఓ యువతిపై ప్రదీప్ అత్యాచారం చేశాడని, బాధితురాలి ఫిర్యాదుతో మైలార్ దేవ్ పల్లి పోలీసులు అతడిని అరెస్టు చేసి జైలుకు పంపగా.. నాలుగు రోజుల క్రితం బెయిలుపై బయటికి వచ్చాడని ఖాకీలు చెప్పారు.

English summary

A owner romantic harassment on 8 years minor girls