భర్త లేకుండా హనీమూన్ కి వెళ్లిన భార్య.. ఎందుకో తెలుసా?

A pakistan wife went to honeymoon without husband

05:49 PM ON 13th July, 2016 By Mirchi Vilas

A pakistan wife went to honeymoon without husband

హనీమూన్ అంటే భార్యాభర్తలు ఇద్దరూ కలిసి వెళ్తారు, బాగా ఎంజాయ్ చేసి వస్తారు. కానీ అదేంటి భర్త లేకుండా భార్య ఒకత్తే హనీమూన్ కి వెళ్లడం ఏంటీ అనుకుంటున్నారా? అయితే అసలు విషయంలోకి వెళ్లాల్సిందే.. పెళ్లైన కొత్త జంట హనీమూన్ కు ఎలాంటి ప్లాన్ లు వేసుకుంటారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. చాలా మంది ఎక్కువ సార్లు హనీమూన్ కు ప్లాన్ చేసి తమ జీవిత భాగస్వామితో ఆనందంగా గడుపుతుంటారు. కానీ పాకిస్థాన్ కు చెందిన ఓ జంటకు మాత్రం వింత అనుభవం ఎదురైంది. అనుకోని కారణాలతో భర్త వెళ్లలేకపోతే.. హనీమూన్ కు భార్య మాత్రమే వెళ్లివచ్చింది.

వింతగా అనిపిస్తోంది కదా.. కానీ నిజం. భర్త లేకుండా కేవలం భార్య, తన అత్తామామలతో కలిసి హనీమూన్ ట్రిప్ కు వెళ్లివచ్చింది. ఆ ట్రిప్ లో ఆమె దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో ఇప్పుడు బాగా హల్ చల్ చేస్తున్నాయి. అసలు ఆ మహిళ ఎవరు? ఏంటా స్టోరీ తెలియాలంటే, కధలోకి వెళ్లాల్సిందే.. పాకిస్తాన్ లోని లాహోర్ కు చెందిన హుమా తన భర్త అర్సలాన్ తో కలిసి రెండోసారి హనీమూన్ వెళ్లాలనుకుంది. వారితో పాటు అత్తామామలను కూడా తమతో పాటు చారిత్రక గ్రీస్ కు తీసుకువెళ్లి సరదాగా గడపాలనుకున్నారు. అనుకున్నట్లుగానే అన్ని సిద్ధం చేసుకున్నారు.

అయితే చివరి నిమిషంలో గ్రీస్ ఎంబసీ అర్సలాన్ కు వీసా నిరాకరించడంతో వారి హనీమూన్ ట్రిప్ మలుపు తిరిగింది. దీంతో అత్తామామతో కలిసి గ్రీస్ వెళ్లింది హుమా. అయితే తన భర్త పక్కన లేకుండా ట్రిప్ వెళ్లడంతో అతడు లేని లోటును వ్యక్తపరస్తూ పలు ప్రాంతాల్లో ఫొటోలు దిగిన హుమా తన ఫేస్ బుక్ లో పోస్ట్ చేసింది. ఒకసారి ఆ ఫోటోలు పై మీరు కూడా ఒక లుక్ వెయ్యండి.

1/19 Pages

English summary

A pakistan wife went to honeymoon without husband