ఓ హత్య కేసులో 'రామచిలుక' సాక్ష్యం అట!

A parrot is an evidence in a murder case

10:48 AM ON 28th June, 2016 By Mirchi Vilas

A parrot is an evidence in a murder case

కోర్టు కేసుల్లో సాక్షాలు ఉండాలి. దాన్ని బట్టే శిక్షలు ఉంటాయి. సాక్ష్యాలు తారుమారైతే ఇక అంతే సంగతులు .. కానీ ఓ హత్య కేసులో రామచిలుక సాక్ష్యంగా మారిందట. పైగా ఈ ఘటన ఇండియాలో కూడా కాదు, అమెరికాలోని మిచిగన్ లో చోటుచేసుకుంది. కేసును విచారిస్తున్న పోలీసులు ఆ రామచిలుక పలుకుతున్న మాటలు చూసి నిర్ఘాంతపోతున్నారు. వివరాల్లోకి వెళ్తే,

మిచిగన్ లోని సాండ్ లేక్ పట్టణంలో గత ఏడాది మేలో భర్త మార్టిన్ ను హత్య చేసిందనే ఆరోపణలతో గ్లెన్న డురమ్ అనే మహిళను పోలీసులు అరెస్టు చేశారు. 5 బుల్లెట్ గాయాలతో వారి నివాసంలో పడి ఉన్న భర్త మార్టిన్ మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. భర్త పక్కనే తలకు బుల్లెట్ గాయంతో గ్లెన్న కూడా ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. అయితే ఈ ఘటన జరిగిన కొన్ని వారాల తర్వాత వారి ఇంట్లో పెంచుకుంటున్న ఓ చిలుక ఆ దంపతుల మధ్య చోటుచేసుకున్న గొడవ గురించి చిన్న చిన్న మాటలతో అరవడం ప్రారంభించింది. ‘ఇంట్లోంచి వెళ్లిపో..’, ‘ఎక్కడికి వెళ్లాలి..’ ‘నన్ను కాల్చొద్దు..’ అనే పదాలను చిలుక పొడిపొడిగా చెబుతుండటాన్ని విచారణాధికారులు గమనించారు.

చిలుక మాటలను అధ్యయనం చేస్తున్నామని.. అయితే ఇలాంటి సాక్ష్యం కోర్టులో అనుమతించదగ్గ సాక్ష్యం అవుతాందా? కాదా? అని నిర్ధారించాల్సి ఉందని న్యూఎగో కౌంటీ ప్రాసిక్యూటర్ రాబర్ట్ తెలిపారు. మరోవైపు తన భర్తను చంపలేదని గ్లెన్న చెబుతోందని పోలీసులు అంటున్నారు. చూద్దాం ఏమి జరుగుతుందో.

ఇది కూడా చూడండి: అక్కడ హిట్టయ్యి ఇక్కడ అట్టర్ ఫ్లాప్ అయిన తెలుగు సినిమాలు

ఇది కూడా చూడండి: సన్నీలియోన్ గురించి మీకు తెలియని విషయాలు

ఇది కూడా చూడండి: హీరోలు వారి మేనరిజం

English summary

A parrot in United States of America, is an evidence in one murder case. The parrot started repeating the fight..