మరో మూడు ఫోన్లు చార్జ్ చేసే ఫోన్

A Phone With 10,000mah Battery

03:46 PM ON 10th December, 2015 By Mirchi Vilas

A Phone With 10,000mah Battery

స్మార్ట్ ఫోన్ అంటే బ్యాటరీ పెద్ద సమస్య. ఒక రోజుకు మించి చార్జింగ్ రావడం లేదని ఎక్కువ మంది ఇచ్చే కంప్లెయింట్. అయితే మీ కోసమే ఈ ఫోన్. ఎంత వాడినా బ్యాటరీ అయిపోదు.. పైగా అవసరం అనుకుంటే ఈ ఫోన్ నుంచే మరో ఫోన్ కు బ్యాటరీ బ్యాకప్ ఇవ్వవచ్చు. చైనాకు చెందిన ఓకిటెల్ సంస్థ తాజాగా విడుదల చేసిన కె10000 స్మార్ట్‌ఫోన్‌ దే ఈ ప్రత్యేకత. ఇందులో 10,000 ఎంఏహెచ్ బ్యాటరీ లభిస్తోంది. ఇది డివైస్‌కు అధిక బ్యాటరీ బ్యాకప్‌ను ఇవ్వడమే కాదు, ఇతర ఫోన్లను కూడా చార్జింగ్ చేసుకునే వీలు కల్పిస్తోంది. ఈ ఫోన్ తో మూడు ఐఫోన్ 6ఎస్ ఫోన్లకు చార్జ్ చేసుకోవచ్చని సంస్థ చెపుతోంది. అమెరికాకు చెందిన ఈ-కామర్స్ సైట్ ద్వారా ఈ ఫోన్ ను ప్రీ బుక్ చేసుకోచ్చు. ఈ ఫోన్ ధర రూ.16వేలు కాగా... ప్రారంభ ఆఫర్ కింద వినియోగదారులకు రూ. 13,500 కే అందిస్తోంది ఓకిటెల్. ఈ ఫోన్ షిప్పింగ్ ను జనవరి 21 నుంచి సంస్థ ప్రారంభించనుంది. అయితే మిగతా దేశాల్లో ఎప్పటి నుంచి దీనిని విడుదల చేస్తుందనే విషయాన్ని ఓకిటెల్ వెల్లడించలేదు.

5.5 ఇంచ్ హెచ్‌డీ ఐపీఎస్ డిస్‌ప్లేతో ఉన్న ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 5.1 లాలిపాప్ తో పనిచేస్తుంది. డ్యుయల్ సిమ్ 4జీ ఎల్‌టీఈ, 1 జీహెచ్‌జడ్ క్వాడ్‌కోర్ మీడియాటెక్ ప్రాసెసర్, 2 జీబీ ర్యామ్, 16 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, 8 మెగాపిక్సల్ రియర్ కెమెరా, 2 మెగాపిక్సల్ ఫ్రంట్ కెమెరా వంటి ఫీచర్లు ఉన్నాయి.

English summary

Chinese mobile company Oukitel launched a new smartphone with a 10000mAh battery.This phone is now available only in american market