రాత్రి ఓ అమ్మాయి పిజ్జా ఆర్డర్ చేస్తే... డెలివరీ బాయ్ ఏం చేసాడో తెలుసా?

A pizaa delivery boy harassed a girl in phone

10:49 AM ON 13th July, 2016 By Mirchi Vilas

A pizaa delivery boy harassed a girl in phone

బెంగుళూరు నగరంలో ఓ అమ్మాయి పిజ్జా ఆర్డర్ చేసింది. అయితే ఆ అమ్మాయికి పిజ్జా నచ్చకపోవడంతో తిరిగి పంపించింది. ఆ పిజ్జా డెలివిరీ బాయ్ మాత్రం ఖచ్చితంగా తీసుకోవాల్సిందేనని ఆమెను బలవంతం చేసాడు. ఆమె రిజెక్ట్ చేసి తిరిగి పంపించడంతో రెచ్చిపోయిన పిజ్జా బాయ్ ఆ అమ్మాయిని వేదింపులకు గురిచేశాడు. తను మాత్రమే కాకుండా తన గ్యాంగ్ మొత్తాన్నీ ఆమె మీదకు ఉసిగొల్పాడు. దీంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు అతణ్ని అరెస్ట్ చేశారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. బెంగళూరులోని జేపీ నగర్ కు చెందిన స్మిత(పేరు మార్చాం) అనే యువతి గత శుక్రవారం రాత్రి ఆన్ లైన్ ద్వారా మెక్ డోనాల్డ్స్ లో ఓ పిజ్జా ఆర్డర్ చేసింది.

రాత్రి పది గంటల సమయంలో పిజ్జా డెలివరీ బాయ్ దానిని తీసుకుని వచ్చాడు. అయితే ఆ పిజ్జా తనకు నచ్చలేదని, దానిని రిటర్న్ తీసుకుపోవాలని కోరింది. ఒక్కసారి ఆర్డర్ చేసిన ఐటెమ్ ను రిజెక్ట్ చేయడం కుదరదని, డబ్బులు ఇవ్వాలని డెలివరీ బాయ్ పట్టుబట్టాడు. డబ్బులు ఇచ్చేది లేదని, తలుపులు వేసుకుని స్మిత వెళ్లిపోయింది. ఆ పిజ్జాను అక్కడే వదిలేసిన డెలివరీ బాయ్, పది నిమిషాల తర్వాత ఆమెకు ఫోన్ చేసి బండ బూతులు మాట్లాడాడు. తన కోరిక తీర్చాలని డిమాండ్ చేశాడు. ఆమె తిట్టి ఫోన్ పెట్టేయడంతో, ఆ నెంబర్ ను తన వాట్సాప్ గ్రూప్ మెంబర్లకు పంపించి, ఆమె ఒక వేశ్య అని, డబ్బులు మాట్లాడుకుని ఎంజాయ్ చేయండని చెప్పాడు.

దీంతో వారంతా ఆమెకు ఫోన్ చేసి, తలో రకంగా వేధించారు. ఆ రాత్రంతా వివిధ నెంబర్ల నుంచి ఆమెకు ఫోన్లు వస్తూనే ఉన్నాయి. ఇక లాభంలేదని తెల్లారాక పోలీసులకు స్మిత ఫిర్యాదు చేసింది. రంగంలోకి దిగిన పోలీసులు డెలివరీ బాయ్ ను అరెస్ట్ చేసి, కేసు దర్యాప్తు చేస్తున్నారు. మిగతా గ్రూప్ మెంబర్ల కోసం గాలిస్తున్నారు.

English summary

A pizaa delivery boy harassed a girl in phone