పోలీసులు చేయలేని పని పిజ్జా చేసింది.. ఎలానో తెలిస్తే ఆశ్చర్యపోతారు!

A pizza saved a woman

10:51 AM ON 14th October, 2016 By Mirchi Vilas

A pizza saved a woman

ఇది ఆశ్చర్యం కలిగించవచ్చు గానీ, నిజం. అమెరికాలోని ఫ్లోరిడాను మూడునాలుగు రోజుల క్రితం మాథ్యూ తూఫాన్ కుదిపేసిన సంగతి తెల్సిందే. మాథ్యూ దాటికి హైతీలో వేలాది మంది మృత్యువాత పడగా అమెరికాను కూడా ఇది గడగడలాడించింది. ఇక ఎరిక్ ఓల్సెన్ నెబ్రాస్కాలోని ఒమాహాలో నివసిస్తుంటాడు. ఆయన 87 ఏళ్ల బామ్మ క్లెయిరీ ఓల్సెన్ ఫ్లోరిడాలోని పామ్ కోస్ట్ లో ఒంటరిగా ఉంటోంది. శనివారం ఈ ప్రాంతాన్ని మాథ్యూ హరికేన్ అతలాకుతలం చేసింది. తూఫాన్ హెచ్చరిక నేపథ్యంలో శుక్రవారం ఉదయం ఎరిక్ తన బామ్మకు ఫోన్ చేసి క్షేమ సమాచారాలు తెలుసుకున్నాడు.

ఇక్కడ పరిస్థితి చాలా ఘోరంగా ఉందని, కరెంటు పోయిందని, అంతా పీడకలలా ఉందని ఆమె చెప్పుకొచ్చిందట. అయితే ఆ తర్వాత రెండు రోజుల వరకు ఆమెతో మాట్లాడేందుకు చేసిన ప్రయత్నాలు మాత్రం ఫలించలేదు. బామ్మ క్షేమసమాచారం కోసం పోలీసులను ఆశ్రయించినా ఫలితం లేకుండా పోయింది.

1/4 Pages

అతడు చెప్పిన అడ్రస్ కు చేరుకోవడం వారికి కూడా కష్టమైంది. చివరికి షరీఫ్ డిపార్టుమెంటుకు ఫోన్ చేసినా ఉపయోగం లేకుండా పోయింది. దీంతో విచారంలో మునిగిపోయాడు. ఆదివారం కూడా బామ్మ గురించి సమాచారం రాకపోవడంతో ఏం చేయాలో తోచలేదు. ఎలాగైనా బామ్మ బతికి ఉందో? లేదో? తెలుసుకోవాలనుకున్న ఎరిక్ కు అద్భుతమైన ఆలోచన తట్టిందే తడవుగా ఓ పిజ్జా సెంటర్ కు ఫోన్ చేసి బామ్మ కోసం ఓ పిజ్జా ఆర్డర్ ఇచ్చాడు.

English summary

A pizza saved a woman