కిడ్నాప్ చేసి.. రేప్ చేశారంటూ అమ్మాయి నాటకం.. ఎందుకలా చేసిందో తెలిస్తే షాకౌతారు!

A played a cinematic drama for her lover

03:43 PM ON 6th October, 2016 By Mirchi Vilas

A played a cinematic drama for her lover

కొందరు అబద్ధం ఆడితే గోడ కట్టినట్టు ఉంటుందని అంటారు. సరిగ్గా ఇక్కడ అదే జరిగింది. ఈ అబద్ధం ఫలితంగా తనను ఇద్దరు యువకులు కిడ్నాప్ చేసి... రేప్ చేశారంటూ అమ్మాయి ఆడిన నాటకంతో పోలీసులు కేసు నమోదు చేసి అమ్మాయి బాయ్ ఫ్రెండ్ తో సహా అతని స్నేహితుడిని జైలుపాలు చేసిన ఘటన బెంగళూరు నగరంలో జరిగింది. సినిమాటిక్ గా జరిగిన ఈ ఘటన బెంగళూరు నగరంలో ఆసక్తి రేకేత్తించింది. బెంగళూరు నగరంలోని ఆదర్శ్ పీయూ కళాశాలలో పీయూసీ రెండోసంవత్సరం చదువుతున్నతన కూతురు మంగళవారం రాత్రి అయినా ఇంటికి రాలేదని తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు అమ్మాయి తల్లి నుంచి ఫిర్యాదు స్వీకరించారు. కాగా తెల్లవారుజామున రెండున్నర గంటలకు అమ్మాయి ఇంటికి తిరిగి వచ్చింది.

తనను రిజిస్ట్రేషన్ నెంబరు ప్లేటు లేని ఇన్నోవా వాహనంలో వచ్చిన ఇద్దరు యువకులు తనను కిడ్నాప్ చేసి మారుమూల జనసంచారం లేని ప్రాంతానికి తీసుకువెళ్లి అత్యాచారం చేసేందుకు యత్నించారని అమ్మాయి చెప్పింది. దీనిపై పోలీసులు ఐపీసీ 363 కింద కేసు నమోదు చేసి నిందితులైన ఇద్దరు యువకులు ఫర్హాన్ అహ్మద్(18), సందీప్ సేన్(18)లను అరెస్టు చేసి జైలుకు పంపించారు. ఈ కేసులో అనుమానం వచ్చిన పోలీసులు అమ్మాయిని ప్రశ్నిస్తే అసలు విషయం వెలుగుచూసింది.

1/5 Pages

కిడ్నాప్, రేప్ యత్నం నాటకమని పోలీసుల దర్యాప్తులో తేలింది. తన బాయ్ ఫ్రెండ్ అయిన ఫర్హాన్ అహ్మద్ ఆ అమ్మాయి గత రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. కాగా 18 ఏళ్లు నిండిన వెంటనే తమ కూతురికి వేరే అబ్బాయితో పెళ్లి చేయాలని అమ్మాయి తల్లిదండ్రులు అనుకుంటున్నారు.

English summary

A played a cinematic drama for her lover