కారులోనే స్వయంగా పురుడు పోసుకున్న మహిళ(వీడియో)

A pregnancy woman gave birth to child in a car

04:38 PM ON 22nd April, 2016 By Mirchi Vilas

A pregnancy woman gave birth to child in a car

ఈ లోకంలో ఎన్నో హత్యలు, మానభంగాలు, పాపాలు రోజుకి ఎన్నో వేల సంఖ్యలో జరుగుతున్నాయి. ఒక మనిషిని కిరాతకంగా ఏ మాత్రం జాలి లేకుండా చంపేస్తున్నారు. కానీ ఆ మనిషిని కనడానికి తల్లి ఎంత కష్టపడుతుందో ఎవరికీ తెలీదు.. తెలిసినా గుర్తుంచుకోరు.. గుర్తుంచుకున్నా పట్టించుకోరు.. అయితే ఇప్పుడు మేము చెప్పేది వింటే మీలో మార్పు రావచ్చు. వేరే దేశానికి చెందిన ఓ మహిళ తన బిడ్డను కనడానికి ఎంత కష్టపడిందో ఇప్పుడు మీకు తెలియజేస్తున్నాం.. లెజియా అనే నిండు గర్భిణి ప్రసవం అయ్యే సమయం దగ్గరకు రావటంతో, తన భర్త జోన్‍తో కలిసి హోస్టన్‍లో ఉన్న తమ ఇంటి నుండి పసదినాలోని బే ఏరియాలో బర్తింగ్ సెంటర్‍కు సొంత టయోటా కారులో ఆసుపత్రికి బయలు దేరారు.

సుమారు 45 నిమిషాల ప్రయాణం తరువాత, లెజియాకి ప్రసవ నొప్పులు అధికమయ్యాయి. ఆమె నొప్పులు తట్టుకోలేకపోయింది. ఆ తరువాత ఆమెకు ఇక ప్రసవానికి కొద్ది క్షణాలే అని అర్ధమైపోయింది. వెంటనే ఆ విషయాన్ని తన భర్తకు తెలియజేసింది. అతను కారుని జాగ్రత్తగా ఆసుపత్రి వైపు నడుపుతూనే భార్యకు తగు జాగ్రత్తలు చెప్తున్నాడు. ఇక ఆమె, శిశువు తల బయటకు రావడం గమనించి, వెంటనే స్పందించి శిశువును జాగ్రత్తగా బయటకు తీసింది. పుట్టిన ఆ శిశువు 10(4.5కేజీలు) పౌండ్ల బరువుతో, ఎంతో ఆరోగ్యంగా ఉన్నాడు. అయితే, లెజియా నొప్పులు ఎక్కువ అవుతున్నాయి అనే దగ్గర నుండి, ప్రసవించేంత వరకు జోన్ తన కెమెరాలో వీడియో తీసి దానిని యూట్యూబ్‍లో పెట్టాడు.

అది పెట్టిన మూడు రోజులలోనే 42 లక్షల వ్యూలు వచ్చి బాగా వైరల్ అయిపొయింది. ఈ సంధర్భంగా లెజియా మాతృ హృదయాన్ని వీక్షకులు మెచ్చుకున్నారు.

English summary

A pregnancy woman gave birth to child in a car