కాలుతున్న శవాన్ని పూజారి రుచి చూసాడట

A Priest in Chennai Eats Burning Dead Body

04:52 PM ON 11th March, 2016 By Mirchi Vilas

A Priest in Chennai Eats Burning Dead Body

ఎన్నో వింతల్లో ఇదో వింత... ఇది తమిళనాట జరిగింది. తిరుచ్చి సమీపంలో అంకాళ పరమేశ్వరి ఆలయంలో శివరాత్రి ఉత్సవాల్లో భాగంగా జరిగిన శ్మశాన కొల్లలో పూనకం దాల్చిన పూజారి శ్మశానంలో మంటల్లో కాలుతున్న శవాన్ని శూలంతో పొడిచి, శవం ముక్కను రుచి చూసాడట. ఈ దృశ్యానికి భక్తులంతా తన్మయత్వం చెందారట. వివరాల్లోకి వెళితే, తిరుచ్చి పెరియకడై వీథిలో అంకాళపరమేశ్వరి అమ్మ వారి ఆలయంలో శివరాత్రి ఉత్సవాలు ఈ నెల 6న ప్రారంభమయ్యాయి. బుధవారం రాత్రి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజ లు జరిగాయి. ఆ తర్వాత పూజరి ఒకరు అంకాళపరమేశ్వరి అమ్మవారి వేషధారణతో చేత శూలం పట్టుకుని శ్మశాన కొల్లకు భక్తు లంతా వెంటరాగా బయల్దేరారు. అర్థరాత్రి ఒయామారి శ్మశానంలో ప్రవేశించిన ఆ పూజరి పూనకంతో ఊగిపోయాడు. ఆ సమ యంలో శ్మశానంలో మండుతున్న ఓ శవం వద్దకు పరుగెత్తుకెళ్ళి తన వద్దనున్న శూలా యుధంతో శవాన్ని పొడిచి పైకి తీయగా ఆ శూలానికి అంటుకున్న శవ మాంసపు ముక్కను నోటిలో వేసుకుని ఆరగించాడు. ఆ తర్వాత ఆ పూజారి ఘనకార్యం చేసినట్టు ఆలయానికి ఊరేగింపుగా చేరుకున్నాడు. కాగా శ్మశానంలో ఈ ఘటన తిలకించేందుకు భక్తులు పెద్దయెత్తున బయల్దేరటంతో వారిని అదుపు చేసేందుకు పోలీసులు స్వల్పంగా లాఠీ చార్జి కూడా చేయడం విశేషం

English summary

A priest in chennai eats burning dead body infront of all the devotes in the occasion of Kolla on the occasion of Sri Mqaha Shiva Ratri Festival.