విద్యార్థినిని రేప్ చేసి వాట్సాప్ లో వీడియో పెట్టిన ప్రిన్సిపాల్

A prinicpal raped a student and putted that video in whatsapp

06:36 PM ON 2nd July, 2016 By Mirchi Vilas

A prinicpal raped a student and putted that video in whatsapp

తమ దగ్గర చదువుకునే విద్యార్థులని కన్న పిల్లల్లా కంటికి రెప్పలా చూసుకోవాల్సిన స్కూల్ ప్రిన్సిపాల్ వారి పాలిట కామాంధుడిలా మారాడు. వారిపై అత్యాచారాలకు పాల్పడడమే కాకుండా వాటిని వాట్సాప్ లో పోస్ట్ చేసి రాక్షస ఆనందం పొందాడు. ఆగ్రాలో జరిగిన ఈ దారుణ సంఘటన వివరాల్లోకి వెళితే.. ఓ 15 ఏళ్ల బాలికను తాను చెప్పినట్టు వినకపోతే ఎగ్జామ్స్ లో ఫెయిల్ చేస్తానని బెధిరించి ఆమెను లోబర్చుకున్నాడు. ఆమె మైనర్ బాలిక తనను ఏం చేయవద్దని ఎంత మొత్తుకున్నా అతడు వినలేదు. ఆమెపై పదే పదే అత్యాచారానికి పాల్పడ్డాడు. అంతటితో ఆగకుండా ఆమెతో గడిపిన వీడియోను వాట్సాప్ లో పోస్ట్ చేసి పైశాచిక ఆనందం పొందాడు.

దాదాపు సంవత్సరం నుంచి తనను బలవంతంగా అనుభవిస్తున్నాడని ఆ బాలిక ఆవేదన వ్యక్తం చేసింది. తాను చెప్పినట్లు రాకపోతే వీడియోను నెట్ లో పెడతానని బెధిరించేవాడని ఆమె తెలిపింది. అతని ఉచ్చులో చిక్కుకుని 20 మందికి పైగా బాలికలు నరకం అనుభవిస్తున్నారని ఆ బాలిక చెప్పింది. నిందితుడు బగ్వాలా ప్రాంతంలోని శ్రీ కృష్ణా సెకండరీ స్కూల్ డైరెక్టర్ గా(జితేందర్ సింగ్ యాదవ్) పోలీసులు గుర్తించారు. నింధితుడు పరారీ అవ్వడంతో పోలీసులు కోసం గాలిస్తున్నారు.

English summary

A prinicpal raped a student and putted that video in whatsapp