ఉన్మాది దాడిలో మహిళ మృతి

A psycho attack on woman in Britain

11:48 AM ON 5th August, 2016 By Mirchi Vilas

A psycho attack on woman in Britain

అది ఏదేశమైనా సరే, మనిషి బయటకు వెళ్తే, సెక్యూరిటీ లేదు. ఏ నిమిషానికి ఏమి జరుగుతుందో తెలీని పరిస్థితి నెలకొంది. తాజాగా లండన్ లోని రసెల్ స్క్వేర్ లో బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఓ ఉన్మాది కత్తితో దాడి చేయగా ఓ మహిళ తీవ్రంగా గాయపడి మరణించింది. మరో ఆరుగురు గాయపడ్డారు. వారిని ఆసుపత్రికి తరలించారు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు ఆ ఉన్మాదిని అరెస్టు చేశారు. ఇది బహుశా ఉగ్ర దాడి అయిఉండవచ్చునని భావిస్తున్నారు. దుండగునికి, ఉగ్రవాదులకు సంబంధం ఉందా అన్న కోణంలో విచారణ జరుపుతున్నారు.

ఓ అధికారి స్టెన్ గన్ ఉపయోగించి ఆ దుండగుడిని అదుపులోకి తీసుకున్నారు. బ్రిటన్ మ్యూజియానికి దగ్గరలో ఈ ఘటన జరగడంతో అక్కడ భద్రత కట్టుదిట్టం చేశారు. ఈ ఘటనతో లండన్ ఉలిక్కి పడింది.

English summary

A psycho attack on woman in Britain