'ప్రేమమ్' ట్రైలర్ లో క్రియేటివ్ గా ఒకటి పెట్టారు.. అదేమిటో కనిపెట్టగలరా?

A quiz in Premam trailer

02:58 PM ON 21st September, 2016 By Mirchi Vilas

A quiz in Premam trailer

ఇదొక ప్రేమకథ కాబట్టి.. ఈ సినిమా ట్రైలర్ లెంగ్త్ ను కరెక్టుగా 1:43 నిమిషాలు ఉంచారు. ఈ 143 ఏ 143 అనేది మనం వేరేగా చెప్పుకోవాలేంటండీ. ఈ క్రియేటివిటీకి ప్రేమ ఎప్పుడూ దాసోహమే. అదే ఈ ట్రైలర్ కొత్త విషయం. ప్రపంచంలో ప్రతీ ప్రేమకథా మధురంగా ఉంటుంది. మనది మనకు అద్భుతంగా ఉంటుంది అంటూ రచ్చలేపే డైలాగ్ తో ట్రైలర్ ఓపెన్ చేసిన నాగ చైతన్య.. ఆ తరువాత అదే ఫీల్ తో ప్రేమమ్ ఎలా ఉండబోతుందో మనకు పరిచయం చేశాడు. ఇక ప్రేమమ్ ట్రైలర్ ఎలా ఉందో ఓ లుక్కేద్దాం.

గోపిసుందర్ అందించిన బ్యాగ్రౌండ్ మ్యూజిక్.. కార్తీక్ ఘట్టమనేని ఇచ్చిన విజువల్స్.. దర్శకుడు చందు మొండేటి డైలాగ్స్ అండ్ టేకింగ్.. అన్నీ పర్ఫెక్టుగా సింక్ అయ్యాయ్. ఓవరాల్ గా ప్రేమమ్ ట్రైలర్ లో ఉన్న ఫీల్ మాత్రం అదిరిపోయింది. ముఖ్యంగా చిన్ననాటి చైతూ.. కాలేజీ బాయ్ చైతూ.. అలాగే మెచ్యూర్డ్ చైతూ గెటప్పులు చాలా బాగున్నాయి. ఇంప్రెసివ్ అనే చెప్పాలి. ఇక శృతి హాసన్ బ్యూటిఫుల్ లుక్.. అనుపమ పరమేశ్వరన్ లోని అమాయకత్వం.. మడోన్నా సెబాస్టియన్ ఛలాకీతనం బాగా నప్పాయి. అలాగే హీరో స్నేహితులుగా చైతన్య కృష్ణ, ప్రవీణ్, శ్రీనివాస్ రెడ్డి కూడా బాగున్నారు. చూస్తుంటే కార్తికేయ సినిమాతో సంచలనం సృష్టించిన చందూ మొండేటి.. ఇప్పుడు ప్రేమమ్ తో మరో బ్లాక్ బస్టర్ తన ఖాతాలో వేసుకుంటున్నాడనే అనిపిస్తోంది.

ఇది కూడా చదవండి: హల్ చల్ చేస్తున్న ఎయిర్టెల్ బ్యూటీ బాత్రూం వీడియో

ఇది కూడా చదవండి: అంబులెన్స్ రాలేదని గర్భిణీ భార్యని 10 కి.మీ. భుజంపై మోసుకెళ్లిన భర్త!

ఇది కూడా చదవండి: ఎక్కువగా అశ్లీల సైట్స్ కే బానిసలవుతున్నారట.. సర్వేలో తేలిన భయంకర నిజాలు!

English summary

A quiz in Premam trailer. Lover boy Akkineni Naga Chaitanya latest movie Premam movie trailer was released. This movie trailer length was 1:43 minutes. That means it is symbol of 143(I Love You)